ETV Bharat / bharat

'ఆ చట్టాలు రద్దు చేయకుంటే పార్లమెంట్​ చుట్టుముడతాం'

author img

By

Published : Feb 23, 2021, 10:55 PM IST

వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకపోతే పార్లమెంట్​ను చుట్టుముడతామని రైతు సంఘం నాయకుడు రాకేశ్​ టికాయిత్​ హెచ్చరించారు. త్వరలో దిల్లీ మార్చ్​కు పిలుపునిస్తామని అందుకు రైతన్నలు సిద్ధంగా ఉండాలన్నారు.

Farmers will gherao Parliament if govt doesn't repeal three agri laws: Tikait
'పార్లమెంట్​ ఘోరావ్​కు సిద్ధంగా ఉండండి'

సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలిపిన రైతులు.. పార్లమెంట్​ను చుట్టుముడతారని రైతుసంఘం నాయకుడు రాకేశ్​ టికాయిత్ హెచ్చరించారు. 'దిల్లీ మార్చ్​'కు ఏ క్షణంలోనైనా పిలుపు రావచ్చని తెలిపారు. ఇందుకు రైతు సోదరులు సిద్ధంగా ఉండాలని కోరారు. రాజస్థాన్​ సీకర్​లో నిర్వహించిన కిసాన్​ మహాపంచాయత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

"రైతు సోదరులారా..! ఈ సారి పార్లమెంట్​ ఘెరావ్​కు సిద్ధంగా ఉండండి. తరువాత దిల్లీలో మార్చ్​ను నిర్వహిస్తాం. ఈ సారి నాలుగు లక్షల ట్రాక్టర్లతో కాకుండా.. నలభై లక్షల ట్రాక్టర్లతో సత్తా చూపాలి. నిరసనల్లో భాగంగా ఇండియా గేట్ దగ్గర ఉండే పార్కులను దున్ని.. పంటలు పండించాలి. త్వరలో పార్లమెంట్​ ఘెరావ్​కు సంబంధించిన తేదీని రైతు సంఘం నాయకులు నిర్ణయిస్తారు."

-రాకేశ్​ టికాయిత్​, రైతు సంఘం నేత

గణతంత్ర దినోత్సవం నాడు తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్​లో హింసకు కుట్ర జరిగిందని ఆరోపించారు టికాయిత్​. దేశంలోని రైతులు త్రివర్ణ పతాకాన్ని ప్రేమిస్తారు, కానీ నాయకులను కాదు అని అన్నారు. సాగు చట్టాలను రద్దు చేయకుండా.. మద్దతు ధరను అమలు చేయకపోతే రైతులు పెద్ద కంపెనీల గోడౌన్లను కూల్చివేస్తారని హెచ్చరించారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్ స్థైర్యంపై మరో దెబ్బ.. కోలుకుంటుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.