ETV Bharat / bharat

'డబ్బుల్లేవు సారు​.. ఎద్దులను తీసుకోండి'.. లంచం అడిగిన అధికారులతో రైతు

author img

By

Published : Mar 28, 2023, 10:27 PM IST

ఉపాధి హామి బిల్లులను చెల్లించేందుకు తనను డబ్బులు లంచంగా అడిగారని.. ఓ రైతు ఏకంగా ప్రభుత్వ కార్యాలయానికి ఎద్దులను తీసుకొని వెళ్లాడు. డబ్బుకు బదులుగా తన దగ్గరున్న రెండు ఎద్దులను లంచంగా తీసుకోవాలని అధికారులను ప్రాధేయపడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

farmer given oxen as bribe to officers news
కర్ణాటకలో ఎద్దులను లంచంగా ఇచ్చిన రైతు

కర్ణాటక బీదర్​​ జిల్లాలో సోమవారం ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఉపాధి హామీ పథకం కింద తనకు రావాల్సిన బిల్లులను చెల్లించేందుకు లంచం అడిగారు అధికారులు. ఏకంగా తన వద్దన్న రెండు ఎద్దులను లంచంగా ఇచ్చాడు ఓ రైతు.

ప్రశాంత్​ బిరాదార అనే రైతు తనకు బకాయి పడ్డ ఉపాధి హామీ పథకం నిధుల కోసం కొన్ని నెలలుగా బసవకల్యాణ్ తాలూకా గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మంజూరైన బిల్లులోని కొంత మొత్తాన్ని చెల్లించగా.. మిగతా డబ్బును చెల్లించేందుకు అధికారులు లంచం అడిగారు. రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని భావించిన ప్రశాంత్​.. అధికారుల తీరుతో విసుగు చెందాడు. చివరకు తాను పెంచుకుంటున్న రెండు ఎద్దులను అధికారులకు లంచంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. వాటిని ఏకంగా పంచాయతీ కార్యాలయానికి తీసుకొని వచ్చాడు. తన దగ్గర డబ్బుల్లేవని.. వాటి స్థానంలో తన రెండు ఎద్దులను లంచం కింద తీసుకోవాలని ప్రశాంత్​ అధికారులను కోరాడు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతు ప్రశాంత్​ బారాదార్​ తన పొలంలో కాంపౌండ్‌ గోడను నిర్మించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంట్లో భాగంగానే అతడికి ప్రభుత్వం నుంచి రూ.లక్ష నిధులు మంజూరయ్యాయి. మంజూరైన లక్ష రూపాయల్లో గ్రామ పంచాయతీ అధికారులు ప్రశాంత్​కు ముందుగా రూ.55 వేలు అందించారు. మిగతా రూ.45 వేలు కూడా ఇవ్వాలంటే తమకు కొంత లంచం ఇవ్వాల్సిందిగా అధికారులు డిమాండ్​ చేశారు. వారి తీరుతో సహనం కోల్పోయిన అతడు తను పెంచుకుంటున్న ఎద్దులను లంచంగా తీసుకొని మిగతా రూ.45 వేలను ఇవ్వాలని అధికారులను అభ్యర్థించాడు. రైతు చేసిన పనితో కార్యాలయంలోని అధికారులు ఇతర సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. సమాచారం అందుకున్న సంబంధిత పంచాయతీ సహాయ సంచాలకులు సంతోష్​ చవాన్​ కార్యాలయానికి చేరుకొని ఆరాతీశారు. అనంతరం రైతు ప్రశాంత్​ బిల్లు బకాయిని త్వరలోనే చెల్లస్తామని హామీ ఇవ్వడం వల్ల ప్రశాంత్​ ఇంటికి వెనుదిరిగాడు.

లంచం ఇచ్చాడు కానీ.. పని జరగలేదు..
సరిగ్గా ఈ నెల 10న కూడా అచ్చం ఇలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రంలోనే జరిగింది. హవేరి జిల్లాలోని సవనూర్​ మున్సిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు.. మున్సిపల్ రికార్డుల్లో తన పేరు మార్పు కోసం మున్సిపల్​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును త్వరగా పరిశీలించాలంటే తమకు లంచం ఇవ్వాలని అధికారులు ఎల్లప్పను డిమాండ్​ చేశారు. చేసేదేమిలేక అధికారులకు లంచం ఇచ్చాడు ఎల్లప్ప. కానీ, ఎల్లప్ప పని మాత్రం పూర్తి చేయలేదు అధికారులు. ఎందుకో తెలియాలంటే.. ఈ కథనం పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.