ETV Bharat / bharat

సింఘు సరిహద్దులో రైతు మృతదేహం లభ్యం- ఏం జరిగింది?

author img

By

Published : Nov 10, 2021, 10:52 AM IST

Updated : Nov 10, 2021, 11:01 AM IST

సింఘు సరిహద్దులో ఓ రైతు మృతదేహం లభ్యమవటం కలకలం సృష్టించింది. ఉరికి వేలాడుతున్న రైతు మృతదేహాన్ని (farmer suicide singhu border) గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇంతకి ఏం జరిగింది?

Farmer Dead Body Found Hanged
సింఘు సరిహద్దులో రైతు ఆత్మహత్య

అన్నదాతలు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దులో ఓ రైతు మృతదేహం (farmer suicide singhu border) కలకలం సృష్టించింది. ఉరి వేసుకుని వేలాడుతున్న రైతు మృతదేహం కనిపించింది. ఆ రైతును ఫతేహగఢ్​​ సాహిబ్​ జిల్లాకు చెందిన గుర్​ప్రీత్ సింగ్​గా పోలీసులు గుర్తించారు.

గుర్​ప్రీత్​ ఆత్మహత్య చేసుకున్నాడని అక్కడ ఉన్న రైతులు చెబుతున్నారు. కానీ, నిజానిజాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రైతు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం అసలు విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: 'పార్లమెంట్‌కు రైతులు.. ఎక్కడ ఆపితే అక్కడే నిరసన'

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై గ్యాంగ్​ రేప్

Last Updated : Nov 10, 2021, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.