ETV Bharat / bharat

చేతివాటం ఓకే.. కానీ అంతా దోచుకోవడం సరికాదు: మంత్రి

author img

By

Published : Apr 24, 2022, 7:44 AM IST

Swatantra Dev Singh: అధికారులు చేతివాటం ప్రదర్శించడంపై ఉత్తర్​ప్రదేశ్​ జలవనరుల శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బును స్వప్రయోజనాల కోసం వాడుకోవడంలో తప్పులేదని కానీ ప్రభుత్వం ధనమంతా దోచేయడం సరికాదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది.

Swatantra Dev Singh
Swatantra Dev Singh

Swatantra Dev Singh: స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ సొమ్మును దోచుకోవడంపై ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలయ్యాయి. అక్రమాలకు పాల్పడటంలో తప్పులేదని, కానీ ప్రభుత్వ సొమ్ము మొత్తం దోచేయడం సరికాదంటూ అధికారులకు సూచించారు ఆ మంత్రి. ఉత్తర్​ప్రదేశ్ ఝాన్సీలోని తెహ్రోలీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్​ సింగ్.

ఇదీ జరిగింది.. తెహ్రోలీలోని సర్​సైదా కెనాల్​, బద్వార్​ చెరువు, అమిలీ కెనాల్​ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు మంత్రి శనివారం ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడం వల్ల మంత్రి అసంతృప్తి చెందారు. ఈ క్రమంలో అందుకు కారణం అధికారుల చేతివాటమే అని భావించిన దేవ్​ సింగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. జీతాలు కాకుండా అదనంగా డబ్బులు సంపాదించడం తప్పుకాదని.. కానీ అలా అని ప్రభుత్వ సొమ్ము మొత్తం దోచేయడం సరికాదని అధికారులకు సూచించారు. రైతుల పొలాలకు నీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని.. కేటాయించిన డబ్బును దానికి ఉపయోగించాలని హితవు పలికారు.

ఇదీ చూడండి: దళిత యువకుడిపై చిత్రహింసలు.. మూత్రం కలిపిన బీరు తాగించి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.