ETV Bharat / bharat

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేయసి దారుణ హత్య.. కాల్చేసి.. పాతిపెట్టి..

author img

By

Published : Dec 7, 2022, 10:04 PM IST

Updated : Dec 7, 2022, 10:44 PM IST

ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి దారుణంగా నరికి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చి.. ఖాళీ స్థలంలో పూడ్చాడు. మరోవైపు, మేత కోసం తన పొలంలోకి వచ్చిన ఆవులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వాటి ప్రాణాలు తీశాడు ఓ వ్యక్తి. ఈ దారుణం కర్ణాటకలో జరిగింది.

punjab murder case
punjab murder case

పంజాబ్​లో​ దారుణం జరిగింది. ఓ యువకుడు తనను నమ్మి కన్నవారిని వదిలి వచ్చిన ప్రేయసిని అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. చివరకు కటాకటాలపాలయ్యాడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లుధియానా జిల్లాకు చెందిన జస్విందర్​ కౌర్​, పరంప్రీత్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందుకే కొద్దిరోజుల క్రితం​ ఇంట్లో నుంచి కొంత డబ్బు, బంగారం తీసుకుని ఆమె పరంప్రీత్​తో పారిపోయింది. అయితే పరంప్రీత్​​, అతడి నలుగురు స్నేహితులు కలిసి ఆ యువతిని గొడ్డలితో నరికి హత్య చేశారు. తరువాత దగ్గర్లోని ఆ కాలువలో శవాన్ని పడేశారు. మళ్లీ ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కాల్చి ఓ ఖాళీ స్థలంతో పాతిపెట్టారు.

అయితే తన సోదరి కనిపించడంలేదని జస్విందర్ సోదరుడు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరంప్రీత్​, అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్​ చేశారు. అనంతరం విచారణ సమయంలో అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులు.. జేసీబీ సాయంతో ఆ స్థలాన్ని తవ్వించి యువతిన మృతదేహాన్ని వెలికితీశారు. తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గోవులను కాల్చి చంపిన వ్యక్తి..
కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి రెండు ఆవులను హతమార్చాడు. సోమవారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని నరేంద్రనాయుడిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే?
కొడుగు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నరేంద్రనాయుడు పొలంలోకి అదే గ్రామంలో ఉంటున్న సీకే మణి పెంచుకుంటున్న మూడు ఆవులు వచ్చాయి. మేత కోసం తన వ్యవసాయ భూమిలోకి వచ్చిన ఆవులపై నరేంద్ర నాయుడు కాల్పులు జరిపాడు. దీంతో రెండు మూగ జీవాలు అక్కడికక్కడే మృతి చెందాయి. కాగా, అర్థరాత్రి మరో ఆవు బుల్లెట్​ గాయాలతో మణి ఇంటికి వచ్చింది. మరుసటి రోజు ఉదయం తన రెండు ఆవులు నరేంద్ర నాయుడు పొలంలో చనిపోయి ఉన్నట్లు మణికి సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న మణి.. ఆవుల శరీరాలపై బుల్లెట్​ గుర్తులు ఉన్నట్లు గుర్తించాడు. అనంతరం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

గేమ్​ మధ్యలో గుండెపోటు..
ఉత్తర్​ప్రదేశ్​లో ఓ యువకుడు క్రికెట్​ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. కాన్పూర్​ జిల్లా బిల్హౌర్​ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. బిల్హౌర్​లోని త్రివేణిగంజ్​ మార్కెట్​లో నివాసం ఉండే అమిత్​ కుమార్​ పాండే ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తున్నాడు. స్థానిక ఇంటర్ కళాశాల మైదానంలో అమిత్ తన స్నేహితులతో కలిసి బుధవారం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. గేమ్​ మధ్యలో పరుగులు తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో మిగిలిన యువకులు వెంటనే అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకి చేరుకుని అమిత్​ను ఆస్పత్రికు తరలించారు. అప్పటికే అమిత్​ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అమిత్​ మృతికి గుండుపోటు కారణమని వైద్యులు తెలిపారు.

teenager died of a heart attack
గేమ్​ మధ్యలో గుండెపోటుతో మృతి చెందిన అమిత్​ కుమార్​ పాండే

వేడినీటి తొట్టె పడి అక్కాచెల్లెళ్లు మృతి..
ఝార్ఖండ్​లో విషాద ఘటన జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు వేడి నీటి తొట్టెలో పడి మరణించారు. పలాము జిల్లాలోని సెల్లారి గ్రామానికి చెందిన పరమేశ్వర్ సాహు కుమార్తెలు స్థానిక అంగన్​వాడీ కేంద్రంలో చదువుకుంటున్నారు. బాలికలిద్దరూ ఆడుకుంటూ స్కూల్ గ్రౌండ్ సమీపంలోని వేడి నీటి తొట్టెలో పడిపోయారు. గమనించిన పాఠశాల సిబ్బంది.. వారిని ఆస్పత్రికి తరలించింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెల్లెలు కుమారి మంగళవారం సాయంత్రం మృతి చెందగా, అక్క శిబు బుధవారం ఉదయం చనిపోయింది. కొన్నిగంటల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడం వల్ల వారి కుటుంబంలో విషాదం నెలకొంది. పాఠశాల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన విద్యాశాఖ.. ఘటనకు కారకులైన అధికారులను సస్పెండ్​ చేసింది.

Last Updated : Dec 7, 2022, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.