ETV Bharat / bharat

ఝార్ఖండ్​ సీఎం, ఆయన సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు

author img

By

Published : Jul 8, 2022, 9:33 AM IST

Updated : Jul 8, 2022, 12:25 PM IST

Enforcement Directorate (ED) conducts raid at the locations of Jharkhand CM Hemant Soren House
Enforcement Directorate (ED) conducts raid at the locations of Jharkhand CM Hemant Soren House

09:20 July 08

ఝార్ఖండ్​ సీఎం, ఆయన సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు

ED Raids Hemant Soren: ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​ సహా ఆయన సన్నిహితుల ఇళ్లపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. టోల్​ ప్లాజా టెండర్​ స్కామ్​కు సంబంధించి.. సాహెబ్​గంజ్​, బెర్హత్​, రాజ్​మహల్​ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈడీ సోదాలు చేస్తోంది. సోరెన్​ ప్రతినిధి పంకజ్​ మిశ్రా నివాసంలోనూ కేంద్ర సంస్థ విస్తృత తనిఖీలు చేపడుతోంది. పంకజ్​ మిశ్రాపై మనీలాండరింగ్​ కేసు విచారణలో భాగంగా.. దాడుల సమయంలో పారామిలిటరీ బలగాల సాయం తీసుకుంది ఈడీ.

రాష్ట్రంలో టోల్​ ప్లాజా టెండర్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. పంకజ్​ మిశ్రా సన్నిహితులైన వ్యాపారవేత్తల ఇళ్లలోనూ ఈడీ దాడులు చేపట్టింది. సోరెన్ ప్రభుత్వంలో పంకజ్ మిశ్రా చాలా కీలకంగా ఉన్నారు. సంతాల్​లోని గనుల వ్యాపారాన్ని పంకజ్ మిశ్రా నిర్వహిస్తున్నారని భాజపా పదే పదే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చూడండి: లాలూకు మందుల ఓవర్​డోస్.. సింగపూర్​ తరలింపు కష్టమే!

నదిలో కొట్టుకుపోయిన టూరిస్ట్​ కారు.. 9 మంది జలసమాధి.. ఒక్కరు సేఫ్​!

Last Updated :Jul 8, 2022, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.