ETV Bharat / bharat

నిరాడంబరంగా బక్రీద్- కోవింద్​, మోదీ శుభాకాంక్షలు

author img

By

Published : Jul 21, 2021, 8:59 AM IST

Updated : Jul 21, 2021, 1:35 PM IST

bakrid celebrations
బక్రీద్ వేడుకలు

దేశవ్యాప్తంగా వివిధ మసీదుల్లో ముస్లింలు బక్రీద్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దిల్లీ జామా మసీదు సహా చాలా చోట్ల బక్రీద్ సందడి కరవైంది. కేరళలో భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాని మోదీ.. ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

బక్రీద్‌ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు నిరాడంబరంగా జరుపుకొంటున్నారు. త్యాగనిరతిని చాటిచెప్పే ఈద్‌-ఉల్‌-అదా(Eid-ul-Adha)ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

bakrid celebrations
గుజరాత్​ అహ్మదాబాద్​లోని జామా మసీదు వద్ద ప్రార్థనలు
Gujarat | Devotees offer namaz at Jama Masjid, Ahmedabad
అహ్మదాబాద్​లోని జామా మసీదు

బక్రీద్‌ సందర్భంగా దిల్లీలోని జామా మసీదు(Jama masjid bakrid celebrations) వద్ద ఉదయం నుంచి పలువురు ముస్లింలు ప్రార్థనలు చేశారు. అయితే, కరోనా ఆంక్షల కారణంగా బక్రీద్​ రోజున సాధారణంగా కనిపించే సందడి కరవైంది. ముస్లింలు ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలని ఇక్కడి ఇమామ్ పిలుపునిచ్చారని, ఈ నేపథ్యంలో జనం తక్కువగా ఉన్నారని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

Delhi: Devotees offered namaz at Jama Masjid
దిల్లీ జామా మసీదు
bakrid celebrations
దిల్లీ జామా మసీదులో కొరవడిన సందడి
People offer namaz at Khairuddin Masjid in Amritsar, Punjab to mark
పంజాబ్ అమృత్​సర్​లోని ఖైరుద్దీన్ మసీదు వద్ద ప్రార్థనలు

కేరళ, కర్ణాటక, మంబయి సహా పలు చోట్ల ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తిరువనంతపురంలో భౌతిక దూరం పాటించి ప్రార్థనలు చేశారు ముస్లింలు.

bakrid celebrations
కేరళ, తిరువనంతపురంలోని ఓ మసీదులో భౌతిక దూరం పాటిస్తూ..
bakrid celebrations
.

రాష్ట్రపతి శుభాకాంక్షలు

దేశంలోని ముస్లింలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్.. బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పండుగ ప్రేమ, త్యాగం, శాంతి, ఐక్యతకు గుర్తని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలతో సంతోషంగా పండుగ జరుపుకొందామని ట్వీట్‌ చేశారు.

మోదీ ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) సైతం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సామరస్యం, సానుభూతి వాతావరణాన్ని ఈ పండుగ మరింత పెంచాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం బక్రీద్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

మిఠాయిలు పంచుకున్న సైన్యం

మరోవైపు, పుల్వామా దాడి తర్వాత తొలిసారి భారత్, పాక్ సైన్యం సరిహద్దులో మిఠాయిలు పంచుకున్నాయి. బాడ్​మేడ్ జిల్లాలోని సరిహద్దు పాయింట్ల వద్ద స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నాయి. పాకిస్థాన్ రేజంర్లకు భారత్​కు చెందిన సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) స్వీట్లు అందించింది.

BSF and Pakistan Rangers exchange sweets
మిఠాయిలు పంచుకుంటున్న సైన్యం
BSF and Pakistan Rangers exchange sweets
.

ఇదీ చదవండి: 'రాష్ట్రాల అంశాల్లో కేంద్ర ఏకపక్ష చట్టాలు చెల్లవు'

Last Updated :Jul 21, 2021, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.