ETV Bharat / bharat

ఈడీ బృందంపై దాడి- కారు అద్దాలు ధ్వంసం- సోదాల సమయంలో ఘటన

author img

By PTI

Published : Jan 5, 2024, 12:37 PM IST

Updated : Jan 5, 2024, 1:48 PM IST

Attack On ED In West Bengal
ED Attack West Bengal

ED Attack West Bengal : రేషన్​ స్కామ్​ కేసులో సోదాలకు దిగిన ఈడీ బృందంపై దాడి జరిగింది. ఈ ఘటన బంగాల్​లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాలో జరిగింది.

ED Attack West Bengal : బంగాల్​లో ఈడీ అధికారుల బృందంపై శుక్రవారం దాడి జరిగింది. రేషన్ పంపిణీ స్కామ్​ కేసులో ఉత్తర 24 పరగణాలు జిల్లా సందేశ్​ఖాలీలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంటికి వెళ్లిన అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఎంసీ మద్దతుదారులు- ఈడీ అధికారులతో పాటు వారి వెంట వచ్చిన కేంద్ర బలగాలను చుట్టుముట్టారు. అనంతరం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ అధికారుల వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీకి చెందిన ఇద్దరు అధికారులు గాయపడ్డారు.

రేషన్ పంపిణీ స్కామ్ కేసులో ఇదివరకే అరెస్టయిన రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియో మల్లిక్​కు షేక్​ షాజహాన్​ అత్యంత సన్నిహితుడు అని అధికారులు తెలిపారు. 'ఎనిమిది మంది దుండగులు ఘటనాస్థలికి వచ్చారు. మా బృందంలోని ముగ్గురు సభ్యులం అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాము. ఈ క్రమంలో వారు మాపై దాడికి దిగారు' అని దాడి సమయంలో ఈడీ బృందంలో ఉన్న సభ్యుడు తెలిపారు.

  • #WATCH | North 24 Parganas, West Bengal: A team of the Enforcement Directorate (ED) attacked during a raid in West Bengal's Sandeshkhali.

    More details are awaited pic.twitter.com/IBjnicU9qj

    — ANI (@ANI) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈడీ అధికారులు 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. అందులో షేక్​ షాజహాన్​ ఇల్లు కూడా ఒకటి. ఈ దాడిలో ఓ అధికారి తలకు గాయమైంది. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇలాంటి దాడి గతంలో ఎప్పుడూ జరగలేదు. షేక్ షాజహాన్​కు సంబంధించిన నివేదికను దిల్లీ కార్యాలయానికి పంపించాం."
- ఈడీ అధికారులు

బీజేపీ విమర్శలు​
ఈడీ అధికారులపై దాడిని బీజేపీ నేతలు ఖండించారు. టీఎంసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. "దాడి జరిపించిన వారిపై అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈడీ సోదాలు నిర్వహించేందుకు టీఎంసీ నేతల ఇళ్లకు వెళ్లింది. దీనిని చూస్తుంటే రోహింగ్యాలు రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఏం చేస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది" అని బంగాల్​ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్​ ధ్వజమెత్తారు.

  • #WATCH | On the alleged attack on ED, West Bengal BJP Chief Sukanta Majumdar says, "There is a complaint & corruption charges against all of them. It is natural that ED will take action. It is quite obvious. The attack on ED in West Bengal's Sandeshkhali shows what the Rohingya… pic.twitter.com/Xwo0oKaoSA

    — ANI (@ANI) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'షాజహాన్​ షేక్​ సందేశ్​ఖాలీ ప్రాంతానికి చెందిన డాన్​. అతడిపై చాలా హత్య కేసులు ఉన్నాయి. అతడు టీఎంసీలో కీలక నాయకుడు కూడా. అందుకని పోలీసులు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇక ఈడీ అధికారులపై జరిగిన దాడి ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి' అని అన్నారు బంగాల్​ మాజీ బీజేపీ అధ్యక్షుడు రాహుల్​ సిన్హా.

  • #WATCH | On a team of ED attacked during raids in West Bengal, Former West Bengal BJP President Rahul Sinha says, "Shahjahan Sheikh is a don of the Sandeshkhali area. He is also a TMC leader. There are a lot of murder cases against him. The police do not take any action because… pic.twitter.com/xiz8wr7P0D

    — ANI (@ANI) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ కేసు
West Bengal Ration Scam : రేషన్​ కుంభకోణం కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు బంగాల్​ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్​. ఈయన సన్నిహితుడైన బొంగావ్ మునిసిపాలిటీ ఛైర్మన్​ శంకర్​ అధ్యాపైనా ఈ కేసుకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిప్రియో మల్లిక్ సన్నిహితుడైన టీఎంసీ నాయకుడు షేక్​ షాజహాన్​ నివాసాలు, కార్యాలయాలపైనా దాడులకు ప్రయత్నించింది ఈడీ ప్రత్యేక బృందం.

రెండు కూనలకు జన్మనిచ్చిన తెల్ల పులి- 4 నెలలు రహస్యంగా ఉంచిన అధికారులు!

ఇనుము లేకుండానే రామమందిర నిర్మాణం- 21 అడుగుల గ్రానైట్ పునాది- 'అయోధ్య అద్భుతాలు' ఇవే

Last Updated :Jan 5, 2024, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.