ETV Bharat / bharat

గంగా నదిలో వదిలితే.. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?

author img

By

Published : Oct 3, 2021, 4:13 PM IST

due-to-superstition-child-dead-body-shed-in-ganga-at-sahibganj
గంగానదిలో పడేస్తే.. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? సాహిబ్​గంజ్​ న్యూస్​

చనిపోయిన వాళ్లు మళ్లీ బతుకుతారా? పూజలు చేస్తే.. పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఎవరైనా ఇది అసాధ్యమనే అంటారు. కానీ.. మూఢనమ్మకాల పేరుతో కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పాముకాటుతో చనిపోయిన ఓ బాలుడు బతికొస్తాడని.. అతడి మృతదేహాన్ని గంగానదిలో వదిలిపెట్టిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

బతికొస్తాడని నదిలోకి బాలుడి మృతదేహాన్ని వదిలి..

మూఢనమ్మకాలతో కొన్నిచోట్ల ప్రజలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఝార్ఖండ్​ సాహిబ్​గంజ్​లోని ఓ ప్రాంతంలో ఇలాంటి ఘటనే బయటపడింది.

పథ్తర్​చట్టీకి చెందిన బిపోతీ మండల్ కుమారుడు మున్నా(8).. అక్టోబర్​ 1 సాయంత్రం తన ఇంటి సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతడి కాలుపై పాము కాట్లు ఉన్నట్లు గుర్తించిన గ్రామస్థులు.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయినట్లు నిర్ధరించారు వైద్యులు.

మున్నా తండ్రి పొట్టకూటి కోసం కేరళలో కూలీపని చేస్తున్నాడు. అతడు.. ఝార్ఖండ్​లోని ఇంటికి వచ్చే సరికి ఎలాగూ ఆలస్యం అవుతుందని గ్రహించిన బంధువులకు ఒక ఉపాయం తట్టింది. అదే వారి మూఢనమ్మకం. అరటిచెట్టు కాడలతో.. ఒక బెడ్​లా అమర్చి, అలంకరించి దానిపై బాలుడి మృతదేహాన్ని ఉంచి సోభాపుర్​లోని గంగా ఘాట్​లోకి వదిలారు.

due-to-superstition-child-dead-body-shed-in-ganga-at-sahibganj
బాలుడి మృతదేహాన్ని నదిలోకి వదులుతూ..
due-to-superstition-child-dead-body-shed-in-ganga-at-sahibganj
బాలుడి మృతదేహాన్ని నదిలోకి విడుస్తున్న గ్రామస్థులు

దేవుడు కోరుకుంటే.. తప్పకుండా ఆ బాలుడు మళ్లీ బతికొస్తాడని వారు నమ్మారు. నీరు లోపలకు వెళ్లి.. విషం బయటకు వస్తుందన్న అతివిశ్వాసంతోనే నదిలో విడిచిపెట్టారు. గ్రామస్థులందరూ అక్కడకు వెళ్లారు.

due-to-superstition-child-dead-body-shed-in-ganga-at-sahibganj
నదిలో బాలుడి మృతదేహం
due-to-superstition-child-dead-body-shed-in-ganga-at-sahibganj
నదిలోనే బాలుడి మృతదేహం
due-to-superstition-child-dead-body-shed-in-ganga-at-sahibganj
తరలివచ్చిన గ్రామస్థులు

ఇలా చేయొద్దు..

అయితే.. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆస్పత్రి వైద్యులు మూఢనమ్మకాలకు ఇదో చెత్త ఉదాహరణ అని అన్నారు. మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ పాముకాటు వంటి ఘటనలు జరిగినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటూ ఆస్పత్రులకు వెళ్లాలనుకోవట్లేదని అంటున్నారు. ఇప్పుడు ఆస్పత్రుల్లో అన్ని వసతులు, ఔషధాలు ఉంటున్నాయన్నారు.

ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలానే జరిగాయి.

మూఢనమ్మకాలతో ఓ యువతిని గొలుసులతో కట్టేసిన ఘటన ఝార్ఖండ్ బిష్టుపుర్​లో ఇటీవల వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల యువతిని నది ఒడ్డున చైన్లతో బంధించారు. నెల రోజులుగా ఆమెను బంధించి ఉంచినట్లు తెలుస్తోంది. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మధ్యప్రదేశ్​ ధార్ జిల్లాలోనూ గత నెలలో ఇలాంటి ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. కరెంట్​ షాక్​తో చనిపోయిన ఓ కార్మికుడి మృతదేహాన్ని గంటలకొద్దీ బురదనేలలోనే ఉంచారు గ్రామస్థులు. బాడీని తడి నేలలో ఉంచితే.. శరీరం నుంచి విద్యుత్తు బయటకుపోయి బతికొస్తాడని ఆ గిరిజన తెగకు చెందిన ప్రజలు విశ్వసించడమే కారణం.

ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఈ జనవరిలో వెలుగు చూసిన ఓ అమానుష ఘటన కలకలం రేపింది. కన్న పిల్లల్నే చంపుకొన్నారు ఆ దంపతులు. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి: ఆ శక్తుల కోసం జల సమాధికి సిద్ధమైన మహిళ.. చివరకు...

మూఢ నమ్మకంతో చెట్టుకు పూజలు

మూఢ నమ్మకాలతో.. కన్న తండ్రినే హత్య చేసిన కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.