ETV Bharat / bharat

ఆ శక్తుల కోసం జల సమాధికి సిద్ధమైన మహిళ.. చివరకు...

author img

By

Published : Sep 7, 2021, 3:52 PM IST

woman-taking-samadhi-in-ganga
శక్తుల కోసం జల సమాధికి సిద్ధమైన మహిళ.

రాత్రి కలలో దేవత వచ్చి, తనకు శక్తులు ఇస్తానని చెప్పిందని ఓ మహిళ జలసమాధికి సిద్ధమైంది. తెల్లవారగానే గంగానదికి చేరుకుని నీటిలో మునిగేందుకు యత్నించింది. అందుకు ఆమె భర్తతో పాటు గ్రామస్థులు వంతపాడారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అతీత శక్తులు వస్తాయని జల సమాధికి సిద్ధమైన మహిళ

మానవాళి అభివృద్ధిలో రాకెట్​ వేగంతో దూసుకెళ్తున్నా.. మూఢ నమ్మకాలు మాత్రం వీడడం లేదు. గుడ్డిగా నమ్ముతున్న కొందరు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనే ఝార్ఖండ్​, సాహిబ్​గంజ్​లో జరిగింది. గంగామాత కలలోకి వచ్చి.. తనలో కలిసిపోతే(జలసమాధి) నా శక్తులు ఇచ్చేస్తానని చెప్పిందని, దేవత చెప్పినట్లు చేస్తే కల నిజం అవుతుందని నమ్మింది ఓ మహిళ. నగరం సమీపంలోని చానన్​ ఘాట్​కు చేరుకుని గంగానదిలో జలసమాధి అయ్యేందుకు యత్నించింది.

గంగానదిలో మహిళ జల సమాధి కాబోతున్నట్లు తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున చానన్​ ఘాట్​కు చేరుకున్నారు. డోలు వాయిద్యాలు వాయిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళ భర్త సుదామా రవిరాజ్​ పురోహితుడు. మహిళ గంగానదిలోకి దిగిన క్రమంలో ఒడ్డుపై అతను ప్రత్యేక పూజలు చేశాడు. తన భార్య రీతా దేవి.. గంగా మాత భక్తురాలని అతను చెప్పాడు. దేవత కలలోకి వచ్చి శక్తులు ఇస్తానని చెప్పిందని, ఆ శక్తులను సాధించేందుకు 24 గంటల పాటు గంగానదిలో మునగాలని తెలిపాడు. 24 గంటల తర్వాత బయటకు వచ్చాక గంగాదేవి, శివుడు వారి శక్తులు మహిళలకు ఇస్తారని స్థానికులు సైతం తెలిపారు.

మరోవైపు.. ఇదంతా తప్పుగా భావించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆమెను​ స్టేషన్​కు తరలించారు. పోలీసులు రావటంపై పలువురు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారించగా.. తాను గంగానదిలో మునిగి 24 గంటల తర్వాత బయటకు రాగానే.. తనపై ఇద్దరు వ్యక్తులు బాణాలు వేస్తారని, పరీక్ష పూర్తయ్యాక, భక్తులు పూలమాలలు వేసి వేడుకుంటారని, అప్పుడు తనకు అతీత శక్తులు వస్తాయని మహిళ తెలపటం గమనార్హం.

" ఈ సంఘటనపై సమాచారం రాగానే పెట్రోలింగ్​ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహిళ ప్రాణాలు రక్షించారు. సరైన సమయానికి సమాచారం రాకపోయుంటే.. గంగానదిలో మునిగి మహిళ ప్రాణాలు కోల్పోయేది. మా చర్యలకు గ్రామస్థులు అడ్డుచెప్పారు. కానీ, అది దేవుడిపై విశ్వాసం పేరుతో చేసే మూఢనమ్మకం."

- సునీల్​ కుమార్​, పోలీసు అధికారి

ఇలాంటి మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. దేవుడిపై విశ్వాసం పేరుతో ఇలాంటి వాటిని ఆచరించకూడదని సూచించారు.

ఇదీ చూడండి: వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.