ETV Bharat / bharat

డీఎంకే కూటమిలో సీపీఐకి 6 సీట్లు.. కాంగ్రెస్​పై అనిశ్చితి

author img

By

Published : Mar 6, 2021, 5:46 AM IST

Updated : Mar 6, 2021, 7:10 AM IST

తమిళనాడులో డీఎంకే కూటమి సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. సీపీఐకి 6 సీట్లు కేటాయించిన డీఎంకే.. గత ఎన్నికల్లో కంటే ఈ సారి 7 స్థానాలను తగ్గించుకుంది. అయితే.. ఈ కూటమిలో కాంగ్రెస్​ సీట్ల పంపకం విషయంలో అనిశ్చితి వీడలేదు.

DMK concludes deal with CPI, Congress vows to fight for a respectable number of seats
డీఎంకే కూటమిలో సీపీఐకు 6 సీట్లు.. కాంగ్రెస్​ తర్జనభర్జన

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే కూటమి సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ద్రవిడ మున్నేట ఖళగమ్​(డీఎంకే)లో.. మిత్రపక్ష కమ్యూనిస్టు పార్టీ ఆఫ్​ ఇండియా(సీపీఐ​)కు 6 సీట్లు దక్కాయి. అయితే.. మరో భాగస్వామియైన కాంగ్రెస్​.. పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని కాపాడుకునేందుకు తర్జనభర్జన పడుతోంది.

'30 సీట్లు ఇవ్వకపోతే డీఎంకే ఓటమే'

ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్​, మణితనేయ మక్కల్​ కచ్చీలకు ఈ ఏడాది కూడా మూడు, రెండు సీట్ల చొప్పున కేటాయించింది డీఎంకే. కూటమిలో భాగమైన వీసీకేకు ఆరు స్థానాలు ఇచ్చింది. అయితే.. డీఎంకే మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల కంటే.. ఈ సారి 7స్థానాల్లో పోటీని విరమించుకుంది. కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్​ సీట్ల పంపకం మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు. డీఎంకే.. కాంగ్రెస్​కు 22 స్థానాలను కేటాయించగా.. అందుకు విముఖత వ్యక్తం చేసింది హస్తం పార్టీ​. తమకు కనీసం 30 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి. లేకపోతే డీఎంకే ఓటమి చవిచూస్తుందని పేర్కొన్నాయి.

అయితే.. డీఎంకేతో సీట్ల సర్దుబాటుపై ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా వీడలేదని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీరప్ప మొయిలీ అన్నారు. త్వరలోనే ఈ విభేదాలను పరిష్కరించుకుంటామన్నారు. పార్టీ స్థైర్యాన్ని కాపాడుకునేందుకు గౌరవనీయమైన సీట్ల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

పీఎంకే వరాల జల్లు..

తమిళ రాష్ట్రంలో ఏప్రిల్​ 6న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఏఐఏడీఎంకే మిత్ర పక్షమైన పట్టాలి మక్కల్​ కచ్చీ(పీఎంకే) శుక్రవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే.. ఉచిత ఆరోగ్య సదుపాయం కల్పించడం సహా 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ చదవండి: అసోం ఎన్నికలు: 70 స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఖరారు

Last Updated : Mar 6, 2021, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.