ETV Bharat / bharat

శాసనసభాపక్షనేతగా స్టాలిన్- 7న సీఎంగా ప్రమాణం

author img

By

Published : May 4, 2021, 8:55 PM IST

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మే 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

DMK chief Stalin
స్టాలిన్

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సమావేశంలో 133 మంది డీఎంకే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మే 7న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగానే నిర్వహించనున్నట్లు స్టాలిన్ ఇదివరకే​ తెలిపారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ.. డీఎంకే కూటమి 158 స్థానాల్లో గెలిచి సంపూర్ణ ఆధిక్యం సాధించింది.

ఇదీ చదవండి : డీఎంకే సక్సెస్​ మంత్ర.. 'స్టాలిన్​'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.