ETV Bharat / bharat

173 మందితో డీఎంకే జాబితా- బరిలో ఉదయనిధి స్టాలిన్​

author img

By

Published : Mar 12, 2021, 12:50 PM IST

Updated : Mar 12, 2021, 1:29 PM IST

అసెంబ్లీ ఎన్నికలకు 173మందితో కూడిన అభ్యర్థుల జాబితాను డీఎంకే అధినేత స్టాలిన్​ ప్రకటించారు. స్టాలిన్​తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి కూడా బరిలో దిగనున్నారు.

DMK chief Stalin announced their candidates
అభ్యర్థుల జాబితాను ప్రకటించిన స్టాలిన్​

ఏప్రిల్​ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 173మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది డీఎంకే. పార్టీ అధినేత స్టాలిన్​, కోలాతూర్​ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి,చేపాక్- ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.

పార్టీలో పేరుపొందిన దురై మురుగన్​, కె.ఎన్​.నెహ్రూ, కె.పోన్ముడి, ఎమ్​ఆర్​కే పన్నీర్​సెల్వంతో పాటు దాదాపు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే స్టాలిన్​ ప్రధాన్యతనిచ్చారు. మార్చి 15న నామినేషన్​ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్​, వామపక్షాలు, ఎమ్​డీఎమ్​కే, వీసీకే వంటి పార్టీలతో కలిసి పోటీలోకి దిగనున్న డీఎంకే.. మిత్రపక్షాలకు 61 సీట్లను కేటాయించింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి.

ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్​, మణితనేయ మక్కల్​ కచ్చీలకు మూడు, రెండు సీట్ల చొప్పున కేటాయించింది డీఎంకే. కూటమిలో భాగమైన వీసీకేకు ఆరు స్థానాలు ఇచ్చింది. డీఎంకే గత ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే.. ఈ సారి 7స్థానాలు తగ్గించుకొని బరిలో దిగుతోంది.

ఇదీ చదవండి: మహిళా ఓటర్లకు బంగారం తాయిలాలు!

Last Updated : Mar 12, 2021, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.