ETV Bharat / bharat

'పాజిటివిటీ 10%పైన ఉన్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు'

author img

By

Published : Jul 31, 2021, 6:17 PM IST

దేశంలో కరోనా మహమ్మారి(Corona Virus) మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో చర్యలు చేపట్టింది కేంద్రం. పాజిటివిటీ రేటు(Covid positivity rate) 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్​ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.

Covid positivity
కరోనా వైరస్​

దేశంలో గత కొద్ది వారాలుగా కొవిడ్​ పాజిటివిటీ రేటు(Covid positivity rate) 10శాతంకన్నా ఎక్కువ ఉన్న జిల్లాల్లో వైరస్(Corona virus)​ కట్టడికి కఠిన ఆంక్షలు విధించాలని సూచించింది కేంద్రం. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవాలని.. కేసులు, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోన్న 10 రాష్ట్రాలను ఆదేశించింది.

దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో కొవిడ్​ పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువగా ఉండగా.. మరో 53 జిల్లాల్లో 5-10 శాతంగా ఉంది. ఈ క్రమంలో కొవిడ్​ కేసులను గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఆయా జిల్లాల్లో కరోనా కట్టిడిలో అలసత్వం వహిస్తే దుర్భర పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించింది.

కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్​, మణిపుర్​ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేస్​ భూషణ్​. కేసుల గుర్తింపు, కట్టడి, నిర్వహణపైనా సమీక్షించారు.

" ఆయా రాష్ట్రాల్లో 80 శాతానికిపైగా కేసులు హోంఐసోలేషన్​లో ఉన్నట్లు చెప్పారు. అలాంటి వారు బయటకి రాకుండా, ఇతరులకు వైరస్​ వ్యాప్తి చేయకుండా నిఘా వేస్తూ.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఐసోలేషన్​లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. చికిత్స అసరమైన వారిని సమయానికి ఆసుపత్రికి తరలించేలా చూడాలి. ఈ అంశంపై ఇప్పటికే అనుసరించాల్సిన విధానాలను రాష్ట్రాలకు తెలియజేశాం. అలాగే.. 10 శాతంలోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలపైనా దృష్టి సారించాలి. ఆయా జిల్లాల ప్రజల రక్షణకు కట్టుబడి.. వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయాలి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కనీస పరిమాణంలో వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది. అయితే.. వినియోగాన్ని అనుసరించి అదనంగా ఆరోగ్య శాఖ సరఫరా చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి. "

- కేంద్ర ఆరోగ్య శాఖ.

జిల్లాల వారిగా సొంత సెరోసర్వేలను నిర్వహించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. జాతీయ స్థాయిలో నిర్వహించే సర్వే.. అందుకు భిన్నంగా ఉంటుందని పేర్కొంది. 80 శాతం మరణాలు 45-60ఏళ్ల వయసు వారిలోనే సంభవిస్తున్న నేపథ్యంలో వారికి వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయాలని ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ బలరామ్​ భార్గవ సూచించారు. అనవసర ప్రయాణాలను తగ్గించాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడటాన్ని నిరోధించాలని కోరారు.

ఇదీ చూడండి:Corona Cases: దేశంలో కొత్తగా 41 వేల మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.