ETV Bharat / bharat

దిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత

author img

By

Published : Nov 8, 2021, 9:45 AM IST

దిల్లీలో వరుసగా మూడోరోజు గాలినాణ్యత క్షీణించింది. వాయునాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడమే ఇందు కారణంగా తెలుస్తోంది.

Weather in Delhi
దిల్లీలో వాతావారణం

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడం వల్ల దిల్లీలో వరుసగా మూడో రోజు గాలి నాణ్యత క్షీణించింది. దిల్లీలో వాయునాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది.

మొత్తంగా దేశరాజధానిలో గాలినాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. దిల్లీ యూనివర్సిటీ నార్త్​ క్యాంపస్​.. 466 పాయింట్లతో అత్యంత కాలుషితమైన ప్రాంతంగా నమోదైంది. ఐఐటీ దిల్లీ ప్రాంతంలో(441), లోధి రోడ్డు(432), పూసా రోడ్డు(427) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

దిల్లీ విమానాశ్రయం, ఇండియా గేట్ ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరిగిపోయి ఆకాశంలో పొగమంచు పొరలా ఆవరించింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దిల్లీలో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు కేజ్రీవాల్‌ సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. రహదారుల మీద నీటిని చల్లేందుకు వాటర్ ట్యాంకర్లను మోహరించింది. స్మాగ్ గన్స్‌ను ఏర్పాటు చేసి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చూడండి: యూపీలో జికా కలకలం.. మరో 10 మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.