ETV Bharat / bharat

రూ.10కే తిన్నంత భోజనం- అదీ ఏసీ రూమ్​లో..!

author img

By

Published : Oct 14, 2021, 8:47 PM IST

దేశంలో రోజురోజుకు నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రూ.10కి టీ కూడా దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. అటువంటిది రూ.10కి ఏకంగా.. తిన్నంత భోజనం, మినరల్​ వాటర్​ అందిస్తోంది ఓ ఎన్​జీఓ. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయినవారికి, నిరాశ్రయులకు కడుపునిండా భోజనం పెడుతూ.. ఆకలిని తీరుస్తోంది.

Delhi NGO
వన్ మీల్

10 రూపాయలకే తిన్నంత భోజనం

సాధారణంగా రెస్టారెంట్లో భోజనం చేయాలంటే కనీసం రూ.300-500 లేనిదే కడుపునిండదు. ఇక దేశ రాజధాని విషయానికొస్తే.. సామాన్యుడికి జేబుకు చిల్లుపడటం ఖాయం! అటువంటిది ఏసీ గదిలో రూ.10కే కడుపునిండా భోజనం అందిస్తోంది 'వన్​ మీల్​' ఎన్​జీఓ. మౌజ్​పుర్​-బాబర్​పుర్​ మెట్రో స్టేషన్​ సమీపంలో 'వన్​ మీల్​' అనే రెస్టారెంట్​ను ఏర్పాటు చేసి తిన్నంత భోజనాన్ని అందిస్తోంది. అంతేకాకుండా అందరికి తాగడానికి మినరల్ వాటర్​నే అందుబాటులో ఉంచి.. అన్నార్తుల ఆకలి తీరుస్తోంది.

one meal
కిరణ్ వర్మ

అలా మొదలైంది..

కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి ఉపశమనం కల్పించడమ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు 'వన్​మీల్​' ఎన్​జీఓ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్​ వర్మ తెలిపారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన తన స్నేహితుడొకరు.. ఆర్థిక సాయం చేయమని వర్మను కోరాడు. దాంతో చలించిపోయిన వర్మ.. మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న కొందరికైనా సాయపడాలనే ఉద్దేశంతో.. తాను చేస్తున్న సామాజిక సేవను మరింత విస్తరించాలని నిర్ణయించారు.

one meal
రూ.10కే కడుపునిండా భోజనం

"తొలుత ప్రజలకు రేషన్​ ఇవ్వడం మొదలుపెట్టాం. అయితే దానిని వారు అమ్ముకుంటున్నారని తెలిసింది. తర్వాత ఉచితంగా భోజనాన్ని అందించడం ప్రారంభించాం. ఆ సమయంలో ప్రజలు ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు గమనించాం. అప్పుడు రూ.1, రూ.5, రూ.10 భోజనం అందిస్తున్నవారి గురించి తెలిసింది. దీంతో ఆహారం వృథా కాకుండా చూసేందుకు నామమాత్రపు ధరను నిర్ణయించాం."

-కిరణ్​ వర్మ, వన్ ​మీల్​ వ్యవస్థాపకుడు

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉండే ఈ రెస్టారెంట్​లో ప్రతిరోజు రకరకాల వంటలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.

one meal
ఎన్​జీఓ నిర్వహిస్తున్న భోజనం హోటల్

"రూ.10కే చపాతీ, అన్నం, కూర, పప్పు, స్వీట్​తో కూడిన భోజనం అందిస్తాం. శని, ఆదివారాల్లో ప్రత్యేకమైన మెనూ కూడా ఉంటుంది.

-కిరణ్​ వర్మ

తన వద్ద భోజనం చేయడానికి వచ్చే నిరుపేదలను 'అతిథులు' అని సంబోధిస్తున్నారు వర్మ. 'మన ఇంటికి వచ్చే బంధువులకు ఏ విధంగానైతే సేవ చేస్తామో.. రెస్టారెంట్​లో భోజనం చేసేవారిని సైతం అంతే బాగా చూసుకోవాలన్నది మా సంకల్పం,' అని పేర్కొన్నారు. ఇక తగినంత డబ్బు లేకపోయినప్పటికీ ఈ భోజన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

one meal
వన్​ మీల్ రెస్టారెంట్
one meal
హోటల్​లో కిటకిటలాడుతున్న జనం

"మొదట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. ఈ మంచి పని కోసం నేనూ- నా భార్య కలిసి చేసుకున్న పొదుపుని ఉపయోగించాం. నా భార్య నగలు తాకట్టు కూడా పెట్టాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ గొప్ప కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందేనని పట్టుదలతో ఉండేవాళ్లం."

-కిరణ్​ వర్మ

రూ.10కే భోజనం అందించే ఈ రెస్టారెంట్​కి చాలా మంది వస్తుంటారు. రోజుకు 800-1,000 మంది.. వారాంతాల్లో 1,200-1,500 మంది ప్రజలు ఇక్కడ కడుపు నింపుకుంటారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.