ETV Bharat / bharat

దిల్లీలో తగ్గని వాయుకాలుష్యం- స్కూళ్లకు సెలవులు పొడిగింపు, కేంద్రం అత్యవసర సమావేశం!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 12:28 PM IST

Delhi Air Quality Index Today
Delhi Air Quality Index Today

Delhi Air Quality Index Today : దిల్లీలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 దాటి తీవ్ర ప్లస్ కేటగిరీలోకి చేరింది. దీంతో దిల్లీలో పాఠశాలలకు సెలవులు మరోసారి పొడగించారు. మరోవైపు దిల్లీ పొరుగు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించాలని.. దిల్లీ మంత్రి కేంద్రాన్ని కోరారు.

Delhi Air Quality Index Today : దేశ రాజధాని దిల్లీ కాలుష్యం కోరల మధ్య నలిగిపోతోంది. వరుసగా ఆరో రోజు కూడా దిల్లీలో వాయు నాణ్యాత తీవ్ర ప్లస్​ కేటగిరీ స్థాయికి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి-సీపీసీబీ వివరాల ప్రకారం రాజధానిలోని చాలా ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 పాయింట్లు దాటింది. షాదీపుర్, వజీర్పుర్, ఓఖ్లా సహా పలు చోట్ల దట్టమైన పొగమంచు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల సమయంలో 415గా ఉన్న గాలి నాణ్యత.. మూడు గంటల్లో 460కి చేరింది. దీంతో ప్రజలు ఉదయపు నడక, క్రీడలు వంటి వాటికి దురమవుతున్నారు. దిల్లీతో పాటు దాని పొరుగున ఉన్న గాజియాబాద్, గురుగ్రామ్​, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్​ నగరాల్లో కూడా గాలి నాణ్యత ప్రమాదస్థాయిలో ఉంది.

  • #WATCH | Delhi | ANI drone camera footage from the Signature Bridge shows a thick layer of haze in the air. Visuals shot at 5 pm today.

    The air quality in Delhi continues to be in 'Severe' category as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/sZq2psMKYh

    — ANI (@ANI) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Delhi Air Pollution : అయితే కేంద్ర వాయు కాలుష్య నియంత్రణ ప్రణాళిక ప్రకారం.. ఏక్యూఐ 450 మార్క్​ను దాటితే కాలుష్య కారకాలైన ట్రక్కులు, వాణిజ్య ఫోర్​వీల్​ వాహనాలు, అన్ని రకాల నిర్మాణ కార్యక్రమాలపై నిషేధం వంచి అత్యవసర చర్యలను అమలు చేస్తారు. అందులో భాగంగా BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని పొరుగు రాష్ట్రాల వాహనాలు దిల్లీ-ఎన్​సీఆర్​లోకి ప్రవేశించకుండా నిషేధించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్​కు ఆదివారం లేఖ రాశారు. దీంతో పాటు దిల్లీ పొరుగు రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరారు.

  • Air quality across Delhi continues to be in the 'Severe' category as per the Central Pollution Control Board (CPCB).

    AQI in Aya Nagar at 464, in Dwarka Sector-8 at 486, in Jahangirpuri at 463 and around IGI Airport (T3) 480 pic.twitter.com/0dlvgOf19W

    — ANI (@ANI) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'గత రెండు రోజులుగా కాలుష్య స్థాయి పెరగడం వల్ల.. దిల్లీలో నిర్మాణాలపై నిషేధం విధించారు. శనివారంతో పోలిస్తే ఆదివారం కాలుష్య స్థాయి మెరుగుపడింది. అయితే పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. కమిషన్ ఫర్ ఎయిర్​ క్వాలిటీ మేనేజ్​మెంట్- సీఏక్యూఎమ్ ఇచ్చిన ఆదేశాలను మిగతా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. నింబంధనలు రూపొందిస్తున్నారు, సీఏక్యూఎమ్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది. కానీ ఎన్​సీఆర్ ప్రాంతంలో ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇది మొత్తం ఉత్తర భారతం సమస్య' అని గోపాల్​ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

దిల్లీలో పాఠశాలలు బంద్
రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తున్నందు వల్ల దిల్లీలోని ప్రాథమిక పాఠశాలలు నవంబర్ 10 వరకు సెలవులు ప్రకటించారు. 6-12 తరగతులకు ​ఆన్​లైన్​ క్లాస్​లు నిర్వహించుకునే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు దిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ట్వీట్ చేశారు.

  • "As pollution levels continue to remain high, primary schools in Delhi will stay closed till 10th November. For grade 6-12, schools are being given the option of shifting to online classes," tweets Delhi Education Minister Atishi pic.twitter.com/fNw8DeKgbP

    — ANI (@ANI) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Delhi Air Pollution Control Measures : అంతకుముందు దిల్లీ ఎన్​సీఆర్​ గాలి నాణ్యత క్షీణిస్తున్న దృష్ట్యా.. నేషనల్ గ్రీన్​ ట్రైబ్యునల్ స్పందించింది. బాధిత రాష్ట్రాల చీఫ్​ సెక్రటరీల నుంచి ప్రతిస్పందనలు శుక్రవారం కోరింది. దాంతోపాటు తక్షణ నివారణ చర్యలను తీసుకోవాలని కోరింది. తీసుకున్న చర్యల నివేదికను ట్రైబ్యునల్​ ముందు సమర్పించాలని కోరింది.

దిల్లీలో ఘోరంగా గాలి నాణ్యత, స్కూళ్లు బంద్- '9ఏళ్లలో కేజ్రీవాల్ చేసిందిదే'

దిల్లీ ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యత, ప్రభుత్వం యాక్షన్ ప్లాన్, పిల్లలు-వృద్ధుల ఆరోగ్యంపై నిపుణుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.