ETV Bharat / bharat

Delhi Air Pollution Today : దిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం.. ఆరోగ్య సమస్యలతో ప్రజల ఇబ్బందులు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 1:54 PM IST

Delhi Air Pollution Today
దిల్లీ వాయు కాలుష్యం

Delhi Air Pollution Today : దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రజల దైనందిన కార్యకలాపాలకు.. ఆటంకం కలిగిస్తోంది. వాయు నాణ్యత 300 ఎగువనే నమోదు కావడం వల్ల ప్రజలకు కళ్లలో మంట, శ్వాస కోస సమస్యలు తలెత్తుతున్నాయి. శీతాకాల కాలుష్య నివారణ కోసం దిల్లీ ప్రభుత్వం 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.

Delhi Air Pollution Today : దేశ రాజధాని ప్రాంతంలో శీతాకాలం కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాలుష్య స్థాయిలు బాగా పెరిగిపోయాయి. దిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో వాయు నాణ్యత సూచీ 221 నుంచి 341 మధ్య నమోదువుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం వాయు నాణ్యత సూచీ 100లోపు ఉంటే.. సంతృప్తకర స్థాయిగా చెబుతారు. వంద దాటితే మాత్రం అనారోగ్యానికి సూచికగా పరిగణిస్తారు.

దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అత్యంత నాసిరకంగా నమోదవుతోంది. ఆదివారం వాయు నాణ్యత సూచీ 309గా నమోదైంది. దిల్లీ యూనివర్శిటీ ప్రాంతంలో 341గా, IIT ప్రాంతంలో 300గా, లోథి రోడ్‌ ప్రాంతంలో 262గా నమోదైంది. దిల్లీ సమీపంలోని నోయిడాలో 372, గురుగ్రామ్‌లో 221గా నమోదైంది. దిల్లీలో గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలోమీటర్లు ఉన్నందున ఆకాశం నిర్మలంగా కనిపిస్తుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

  • As per the latest data from SAFAR-India, the overall air quality in Delhi is in the 'Very Poor' category with an AQI of 309. The air quality in Noida is also in the 'Very Poor' category with an AQI of 372. While the air quality in Gurugram is in the 'Poor' category with an AQI… pic.twitter.com/umGtAmg5Ze

    — ANI (@ANI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉదయాన్నే నడక, పరుగు, జాగింగ్ చేసే వారు, పనుల కోసం వెళ్లే ప్రజలు.. కాలుష్యం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అనేక మందికి కళ్లలో మంట, శ్వాసకోస సమస్యలు వస్తున్నట్లు దిల్లీకి చెందిన డాక్టర్ నాగేంద్ర గుప్తా చెప్పారు. మాస్కులు పెట్టుకుని బయటకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదని ఆయన వివరించారు. రోజంతా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న ఆయన శీతాకాలం 3, 4 నెలలు ఏటా ఈ ఇబ్బంది తప్పడంలేదని చెప్పారు.

కాలుష్య నియంత్రణ కోసం దిల్లీ ప్రభుత్వం 15 పాయింట్ల శీతాకాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. రెడ్‌ లైట్ ఆన్‌లో ఉంటే వాహనం ఆపేయడం, బయోమాస్‌ కాల్చకుండా చూడడం, దుమ్ము, ధూళి రేగకుండా నీటిని చల్లడం వంటి చర్యలను దిల్లీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ ప్రకటించిన 15 పాయింట్ల కాలుష్య నియంత్రణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్ శుక్రవారం ప్రకటించారు.

  • #WATCH | Delhi: On high pollution, a local resident says, "The solution to every problem begins from ourselves. We should not throw garbage outside in the open. And we should use public transport for the benefit of society and to reduce pollution..." pic.twitter.com/FDXantemxd

    — ANI (@ANI) October 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం వాహనాలు, బయోమాస్ కాల్చడం వల్ల తలెత్తి కాలుష్యం పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే రెడ్‌ లైట్ ఆన్‌లో ఉన్నప్పుడు వాహనాలు ఆన్ చేయకుండా ఆపేయాలనే ప్రచారం చేపట్టినట్లు మంత్రి గోపాల్‌ రాయ్ చెప్పారు.

ఎన్​సీఆర్​ పరిధిలో ఆ రాష్ట్రాల బస్సులను నిషేధించాలి : దిల్లీ మంత్రి
నేషనల్​ క్యాపిటల్​ రీజియన్​లో హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​కు చెందిన బీఎస్​ 3, బీఎస్​ 4 డీజిల్ బస్సులపై నిషేధం విధించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. వాహన ఉద్గారాలే దిల్లీ వాయుకాలుష్యానికి ప్రధాన కారణన్నారు. దిల్లీలో కేవలం సీఎన్​జీ, ఎలక్ట్రిసిటీ వాహనాలు నడుస్తాయని ఆయన గుర్తు చేశారు. బీఎస్​ 3, బీఎస్​ 4 వాహనాలు.. ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​, హరియాణాకు చెందినవని ఆయన పేర్కొన్నారు.

Kerala Blast Today : కన్వెన్షన్​ సెంటర్​లో భారీ పేలుడు.. అనేక మందికి గాయాలు.. ఉగ్రదాడి?

ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాలు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.