ETV Bharat / bharat

Decision on Chandrababu Custody Petition: చంద్రబాబు పోలీసు కస్టడీపై నేడే నిర్ణయం.. నేటి హైకోర్టు జాబితాలో లేని క్వాష్‌ పిటిషన్‌..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 7:07 AM IST

Updated : Sep 22, 2023, 10:24 AM IST

Decision on Chandrababu Custody Petition: చంద్రబాబు పోలీసు కస్టడీపై నేడు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నేటి హైకోర్టు కేసుల జాబితాలో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ లేదు. హైకోర్టు స్పందిస్తే తన నిర్ణయాన్ని వాయిదా వేస్తానని న్యాయమూర్తి తెలిపారు. ఏసీబీ కోర్టు నేడే తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు రిమాండ్‌ నేటితో ముగియనుండగా.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట నేడు చంద్రబాబు హాజరు కానున్నారు.

Decision_on_Chandrababu_Custody_Petition
Decision_on_Chandrababu_Custody_Petition

Decision on Chandrababu Custody Petition: చంద్రబాబు పోలీసు కస్టడీపై నేడే నిర్ణయం.. నేటి హైకోర్టు జాబితాలో లేని క్వాష్‌ పిటిషన్‌..

Decision on Chandrababu Custody Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీ కోసం సీఐడీ వేసిన పిటిషన్‌పై.. ఏసీబీ కోర్టు నేడు నిర్ణయం వెలువరించనుంది. కస్టడీ పిటిషన్‌పై గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు వస్తుందేమో చూద్దామన్నారు. లేకుంటే శుక్రవారం ఆదేశాలు ఇస్తామన్నారు. నేటి హైకోర్టు కేసుల జాబితాలో చంద్రబాబు పిటిషన్ లేనందున కస్టడీపై నేడే కోర్టు ఆదేశాలు జారీచేసే అవకాశం కనిపిస్తోంది.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును విచారించేందుకు పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై నేడు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. చంద్రబాబును 5 రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఈ నెల 20న వాదనలు జరిగాయి. 21న నిర్ణయం వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు చెప్పారు.

గురువారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై నిర్ణయం ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులను ఆమె అడిగారు. శుక్రవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తాను అనుకోవడం లేదని.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. నిర్ణయం వెల్లడించాలా, శుక్రవారం వరకు వేచి ఉండాలా అనేది ఏసీబీ కోర్టు ఇష్టమని.. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ చెప్పారు.

TDP MLAs MLCs Condemned Chandrababu Arrest: ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు.. ప్రజలంతా మా వెంటే : టీడీపీ

చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారమే హైకోర్టు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందేమో.. వేచి చూద్దామని న్యాయాధికారి అన్నారు. శుక్రవారం హైకోర్టు నిర్ణయం లేకపోతే పోలీసు కస్టడీపై ఉదయం పదిన్నరకు తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. హైకోర్టు శుక్రవారమే స్పందిస్తే తన నిర్ణయాన్ని వాయిదా వేస్తానని వివరించారు. ఐతే హైకోర్టులో శుక్రవారం విచారణకొచ్చే కేసుల జాబితాలో చంద్రబాబు పిటిషన్‌ లేనందున ఏసీబీ కోర్టు నేడే తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.

ఇదే సమయంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అరెస్టైన చంద్రబాబుకు.. న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్‌ రిమాండు నేటితో ముగియనుంది. తదుపరి ఆదేశాల కోసం ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో నేడు హాజరు పరచనున్నారు. చంద్రబాబు కోసం 8 మంది వైద్యాధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.

Protests in Telangana Condemning Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. 200 బైక్‌లతో ర్యాలీ

ఈ బృందం ఈ ఉదయం ఎనిమిదన్నరకల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని క్యాజువాలిటీ వద్ద హాజరుకావాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.లక్ష్మీ సూర్యప్రభ గురువారం ఆదేశాలు జారీచేశారు. అత్యవసర మందులు, రెండు యూనిట్ల ఓ పాజిటివ్‌ రక్తాన్ని సిద్ధంగా ఉంచుకుని.. చంద్రబాబును అనుసరించాలని సూచించారు. కాన్వాయ్‌ టీం, ఇద్దరు అంబులెన్స్‌ డ్రైవర్లు, అంబులెన్స్‌లు సహా కేంద్ర కారాగారం వద్ద.. సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీకి రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

TDP Leader Dhulipalla Narendra on Fiber Grid జగన్ అవినీతిలో స్కిల్ మాస్టర్: ధూళిపాళ నరేంద్ర

Last Updated : Sep 22, 2023, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.