ETV Bharat / bharat

పెళ్లిలో భోజనం ప్లేట్​ తాకాడని దళితుడిపై దాడి.. కుటుంబసభ్యులనూ చితకబాది..

author img

By

Published : Dec 12, 2022, 6:22 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో​ దారుణ ఘటన జరిగింది. భోజనం ప్లేటు తాకాడని ఓ దళితుడిని తీవ్రంగా కొట్టారు కొందరు వ్యక్తులు. అనంతరం అతడి కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు.

Dalit thrashed for touching plate in wedding
భోజనం ప్లేటు ముట్టుకున్నాడని దళితుడిపై దాడి

భోజనం ప్లేటు ముట్టుకున్నాడని ఓ దళితుడిని తీవ్రంగా కొట్టారు కొందరు వ్యక్తులు. పెళ్లిలో తినేందుకు వెళ్లిన బాధితుడిపై ఈ దారుణానికి ఒడిగట్టారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గొండ జిల్లా వజీర్‌గంజ్, నవబస్తా గ్రామానికి చెందిన లల్లా అనే వ్యక్తి శనివారం పెళ్లి భోజనానికి తన మామయ్య ఇంటికి వెళ్లాడు. అన్నం తినే సమయంలో అక్కడే ఉన్న సందీప్​ పాండే లల్లాపై దాడి చేశాడు. కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు.

ఆ తర్వాత బాధితుడి కుటుంబ సభ్యులపైన దాడి చేశారు. లల్లా ఇంటికొచ్చిన సందీప్ పాండే, అమ్రేష్ పాండే, శ్రవణ్ పాండే, సౌరభ్ పాండే, అజిత్ పాండే, విమల్ పాండే, అశోక్​తో పాటు​ మరికొందరు కర్రలు, గాజు సీసాలతో గాయపరిచారు. అక్కడే ఉన్న బైక్‌ను కూడా ధ్వంసం చేశారు. చంపేస్తామని బెదిరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
"లల్లా సోదరి రేణు ఘటనపై ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. గత రెండు రోజలుగా ఈ గొడవ జరుగుతోంది" అని వజీర్‌గంజ్ పోలీస్​స్టేషన్ అధికారి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.