ETV Bharat / bharat

దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను - నెల్లూరు, మచిలీపట్నం తీరాల్లో హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 10:38 PM IST

Cyclone_Michaung_News_Updates
Cyclone_Michaung_News_Updates

Cyclone Michaung News Updates: మిచౌంగ్ తుపాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారుతోంది. ఈనెల 5వ తేదీన నెల్లూరు- మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన గంటకు 70- 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

Cyclone Michaung News Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతోంది. అర్ధరాత్రికి ఇది తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, మచిలీపట్నం మధ్య కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం క్రమంగా వాయవ్య దిశగా కదులుతోందని పేర్కొంది. సోమవారం మధ్యాహ్నానికి దక్షిణ కోస్తాంధ్ర -దక్షిణ తమిళనాడు తీరాలకు చేరువగా రానున్న తుపాన్‌ ఈనెల 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

Andhra Pradesh Michaung Cyclone: తీరం వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుపాను కోస్తా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ అర్థరాత్రికి తుపాన్‌గా మారే అవకాశం ఉంది. నెల్లూరుకు ఆగ్నేయంగా 480 కిలోమీటర్లు, మచిలీపట్నం- బాపట్లకు 650 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం తుపాన్‌గా మారి సోమవారం మధ్యాహ్నానికి దక్షిణ కోస్తాంధ్ర -దక్షిణ తమిళనాడు తీరాలకు చేరువగా రానుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.

తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో 80-90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. వచ్చే మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 4 నుంచి సముద్రం అలజడిగా మారుతుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

ముంచుకొస్తున్న మిచాంగ్​ తుఫాను​ - నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

AP CP Jagan Review on Cyclone Michaung: తుపాన్‌ హెచ్చరికలు నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ అధికారులు సమీక్షించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.

విద్యుత్, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ప.గో, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున విడుదల చేశారు. తుపాను కారణంగా అప్రమత్తమైన అధికారులు ప్రకాశం జిల్లాలో సోమ, మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్నిశాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

పొంచి ఉన్న తుపాను ముప్పు - వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.