ETV Bharat / bharat

ఆన్​లైన్​లో 'వ్యాక్సిన్' మోసం.. తండ్రిని పోగొట్టుకున్న డాక్టర్!

author img

By

Published : Dec 23, 2021, 5:38 PM IST

Cyber fraud: ఆన్​లైన్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కి.. ఓ వైద్యుడు రూ.3.6 లక్షల డబ్బుతోపాటు.. తన తండ్రిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఆరు నెలల క్రితం తనకు జరిగిన మోసంపై తాజాగా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏమైందంటే..?

cyber fraud
సైబర్ నేరాలు

Cyber fraud: సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. వారి మాయమాటలు నమ్మి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తీరా మోసపోయామని గ్రహించాక.. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక బెంగళూరులో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఓ డాక్టర్​ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్​లైన్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కి ఆయన తన తండ్రి ప్రాణాలను పోగొట్టుకున్నారు.

అసలేమైందంటే..?

Black fungus vaccine cyber fraud: కొవిడ్​ సెకండ్ వేవ్​ సమయంలో.. బ్లాక్ ఫంగస్ బాధితుల కేసులు భారీగానే నమోదయ్యాయి. చాలామంది ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. బెంగళూరుకు చెందిన వైద్యుడు మహేశ్ తండ్రి కూడా బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ వ్యాధికి చికిత్స కోసం ఆన్​లైన్​లో వెతకగా మహేశ్​కు పంజాబ్​ లుథియానాకు చెందిన రోహన్​ చౌహాన్ అనే వ్యక్తి వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయనే సమాచారం కనిపించింది. దాంతో అతని వద్ద నుంచి 50 వ్యాక్సిన్లను ఆన్​లైన్​లో ఆర్డర్ చేశారు. ఇందుకోసం రెండు వాయిదాల్లో రూ.3.65 లక్షలను రోహన్ సూచించిన ఖాతాకు ఆన్​లైన్​లో పంపించారు.

విప్పి చూస్తే చెప్పులు..

చెప్పిన సమయానికే వ్యాక్సిన్​ డీలర్​ నుంచి మహేశ్​కు డెలివరీ అందింది. అయితే.. ఆ పార్సిల్​ను విప్పి చూశాక కంగుతినడం డాక్టర్ మహేశ్ వంతైంది. ఎందుకంటే.. ఆ పార్సిల్​లో వ్యాక్సిన్లకు బదులుగా రెండు జతల చెప్పులు ఉన్నాయి. అయితే.. డెలివరీలో ఏదో పొరపాటు ఉంటుందని భావించిన మహేశ్​.. డీలర్ రోహన్​కు ఫోన్ చేయాలని ప్రయత్నించారు. కానీ, ఆ తర్వాత ఫోన్ చేస్తే అటువైపు నుంచి సమాధానం లేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించారు మహేశ్​.

ఇదీ చూడండి: ఫోన్​ కొట్టేశాడని.. పడవలో తలకిందులుగా వేలాడదీసి..

ఫొటోలతో నమ్మించి...

Doctor loses father in cyber fraud: మహేశ్ తండ్రికి బ్లాక్ ఫంగస్​ చికిత్సకుగాను అత్యవసరంగా ఇంజెక్షన్లు కావాల్సి ఉండడం వల్లే... పెద్దగా ఆరా తీయకుండానే డీలర్ రోహన్​​ సూచించిన ఖాతాకు తొలుత అతడు రూ.10,000 పంపారు. ఆ తర్వాత తనకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నట్లు నమ్మించేందుకు సదరు డీలర్​.. బిల్లు, పార్సిల్​ వంటి వివరాల ఫొటోలను మహేశ్​కు పంపాడు. వాటిని చూసి, నిజమేనని నమ్మిన మహేశ్​.. రోహన్ ఖాతాకు మిగతా డబ్బులను కూడా పంపించారు. ఆఖరుకు పార్సిల్​లో వ్యాక్సిన్లు కాకుండా.. చెప్పులు రాగా సమయానికి మహేశ్ తన తండ్రికి చికిత్స అందించలేకపోయారు. దాంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ఆర్​టీఐ కార్యకర్తపై దుండగుల దాడి.. కాళ్లకు మేకులు దింపి...

Punjab ludhiana cyber crimes: ఆరు నెలల తర్వాత.. తనకు జరిగిన మోసంపై లుథియానాలో తబ్రి పోలీస్​ స్టేషన్​లో బాధితుడు మహేశ్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తాము ప్రత్యేక దృష్టి సారించామని లుథియానా సైబర్ సెల్​ ఇన్​స్పెక్టర్​ జతీందర్ సింగ్ తెలిపారు.

"దేశంలో రోజూ సైబర్​ నేరాలకు గురయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్​కార్డులు, లాటరీ, బ్యాంక్ వివరాలు అప్​డేట్​, కేవైసీ వంటి పేర్లు చెప్పి సైబర్​ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు దాదాపు 10 మంది సైబర్ నేరాల కేసులు మా వద్ద నమోదవుతున్నాయి. ప్రస్తుతం 400 కేసులను తాము దర్యాప్తు చేస్తున్నాం" అని జతీందర్ సింగ్​ తెలిపారు.

సైబర్ నేరాల్లో బాధితులు హెల్ప్​లైన్ నంబర్లు 155, 260కి కాల్ చేయవచ్చని జతీందర్ సింగ్ తెలిపారు. ఎంత త్వరగా నేరం గురించి తెలియజేస్తే.. బాధితులను పట్టుకోవడం అంత త్వరగా సాధ్యపడుతుందని చెప్పారు. ప్రజలు ఎవరికీ తమ పాస్​వర్డ్​లు, ఓటీపీలను చెప్పకూడదని సూచించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.