ETV Bharat / bharat

ఆ నాలుగు వర్గాలు టీకా ఎప్పుడు వేసుకోవాలంటే?

author img

By

Published : May 21, 2021, 2:50 PM IST

vaccination
వ్యాక్సినేషన్​

కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి జాతీయ టీకా నిపుణుల సిఫారసుల మేరకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. నాలుగు నిర్దిష్ట వర్గాల్లోకి వచ్చే వారు టీకా కోసం వేచి చూడాలని స్పష్టం చేసింది. ఆ కేటగిరీల్లో మీరు ఉన్నారా?

జాతీయ టీకా నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు వ్యాక్సినేషన్​పై కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో నాలుగు నిర్దిష్ట వర్గాల వ్యక్తులు టీకాల ప్రణాళికను వాయిదా వేసుకోవాలని పేర్కొంది.

  1. వైరస్​ నుంచి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకోవటాన్ని వాయిదా వేయాలి.
  2. సార్స్​2 మోనోక్లోనల్​ యాంటీబాడీలు లేదా ప్లాస్మా థెరఫీ చేసిన కొవిడ్​ రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన తర్వాత మూడు నెలల పాటు టీకా తీసుకోవద్దు.
  3. టీకా తొలి డోసు తీసుకన్న తర్వాత కొవిడ్​ బారిన పడిన వ్యక్తులు వైరస్​ నుంచి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు రెండో డోసు తీసుకోకూడదు.
  4. తీవ్రమైన ఇతర అనారోగ్యాలతో ఆసుపత్రి లేదా ఐసీయూలో చేరాల్సిన అవసరం ఏర్పడిన వారు కొవిడ్​ వ్యాక్సిన్​ కోసం 4-8 వారాల పాటు వేచి ఉండాలి.

దేశంలో 18.69 కోట్ల మందికి వ్యాక్సిన్​

భారత్​లో కొవిడ్​ టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. బుధవారం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 18,69,89,265 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి: కొవిడ్​ నుంచి కోలుకున్న 3నెలల తర్వాతే టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.