ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొరియాలో తగ్గని ఉద్ధృతి

author img

By

Published : May 18, 2022, 9:24 AM IST

కరోనా
కరోనా

Coronavirus Update India: దేశంలో ఒక్కరోజే 1,829 మందికి వైరస్​ సోకింది. మరో 33 మంది చనిపోయారు. కోలుకున్నవారి శాతం 98.75కి చేరింది. మరోవైపు ఉత్తరకొరియాలో కరోనా పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉంది. 2,32,880 మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.

Covid cases in india: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కొత్తగా 1,829 కేసులు వెలుగుచూశాయి. మరో 33 మంది చనిపోయారు. ఒక్కరోజే 2,549 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.75 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్​ కేసులు 15,647కు చేరాయి. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,27,199
  • మొత్తం మరణాలు: 5,24,293
  • యాక్టివ్​ కేసులు: 15,647
  • కోలుకున్నవారి సంఖ్య: 4,25,87,259

Vaccination India: దేశవ్యాప్తంగా మంగళవారం 14,97,695 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,91,65,00,770కు చేరింది. ఒక్కరోజే 4 లక్షల 34 వేల 962 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 8.3 లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 1,590 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,37,80,750కు చేరింది. మరణాల సంఖ్య 62,92,464కు చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,36,48,361గా ఉంది.

  • అమెరికాలో కొత్తగా 75,368 కేసులు బయటపడగా.. 305 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 82,591 మందికి కరోనా సోకగా.. 176 మంది మృతిచెందారు.
  • ఆస్ట్రేలియాలో మరో 67,650కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 65 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 44,489 మందికి వైరస్​ సోకింది. 148 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో 43,727 కొవిడ్​ కేసులు నమోదుకాగా.. 90 మంది మహమ్మారికి బలయ్యారు.

కొరియాలో తగ్గని ఉద్ధృతి: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా కరోనా బారినపడి మరో ఆరుగురు మృతిచెందగా.. ‌2,32,880 మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 62కు చేరింది. కరోనా వ్యాప్తి ప్రభుత్వం వెల్లడించిన వివరాల కన్నా తీవ్రంగానే ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అక్కడ వైరస్​ టెస్టింగ్​కు సరిపడా ఏర్పాట్లు లేకపోవడం వల్ల తీవ్రతపై స్పష్టత లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : కరోనా బాధితులను గుర్తిస్తున్న జాగిలాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.