ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

author img

By

Published : Jul 27, 2022, 10:00 AM IST

కరోనా
కరోనా

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 18,313 మంది వైరస్ బారిన పడగా.. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. జపాన్​, జర్మనీల్లో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. జపాన్​లో కొత్తగా 1.54 లక్షల మందికి కరోనా సోకగా.. జర్మనీలో 1.21 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం మధ్య 18,313 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 20,742 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,39,38,764
  • మొత్తం మరణాలు: 5,26,167
  • యాక్టివ్​ కేసులు: 1,45,026
  • కోలుకున్నవారి సంఖ్య: 4,32,67,571

Vaccination India: భారత్​లో మంగళవారం 27,37,235 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,02,79,61,722 కోట్లు దాటింది. మరో 4,25,337 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6,75,085 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,337 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,58,81,194కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,04,942 మంది మరణించారు. ఒక్కరోజే 9,64,127 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,57,30,530కు చేరింది.

  • జపాన్​లో 1,54,011 కేసులు నమోదు కాగా.. 55 మంది మరణించారు.
  • జర్మనీలో కొత్తగా 1,21,780 మందికి వైరస్​ సోకగా.. 181 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 99,268 మందికి కరోనా సోకింది. 17 మంది బలయ్యారు.
  • అమెరికాలో తాజాగా 88,011 కేసులు నమోదు కాగా.. 301 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​ తాజాగా 87,562 మందికి వైరస్​ సోకగా.. 119 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : పువ్వుల కోసం వెళ్లి బావిలో శవంగా తేలిన బాలిక.. కుక్కలే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.