ETV Bharat / bharat

Corona cases in India: దేశంలో మరో 10 వేల మందికి కరోనా

author img

By

Published : Nov 20, 2021, 9:42 AM IST

Covid cases
కరోనా కేసుల

భారత్​లో కొవిడ్ కేసులు (Corona cases in India) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 10,302 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ కారణంగా మరో 267 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా(Coronavirus India) వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 10,302 మంది వైరస్ బారిన పడినట్లు (Corona cases in India) తేలింది. కొవిడ్​(Coronavirus India)​ ధాటికి మరో 267 మంది మరణించారు. ఒక్కరోజే 11,787 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా 0.36 శాతానికి తగ్గి.. యాక్టివ్​ కేసుల సంఖ్య 531 రోజుల కనిష్ఠానికి చేరింది.

  • మొత్తం కేసులు: 3,344,99,925
  • మొత్తం మరణాలు: 4,65,349
  • యాక్టివ్​ కేసులు: 1,24,868
  • కోలుకున్నవారు:3,39,09,708

టీకాల పంపిణీ

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 51,59,931 డోసులు అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,15,79,69,274కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ(coronavirus worldwide) కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,94,375 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి మరో 7,504 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,69,60,613 కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 51,55,321కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 1,11,829మందికి వైరస్​ సోకింది. మరో 1,332 మంది చనిపోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 59,266 మందికి కొవిడ్ సోకింది. 230 మంది మరణించారు.
  • రష్యాలో మరో 37,156 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,254 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 44,242 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 157 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 23,810 కరోనా​ కేసులు నమోదవగా.. 218 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: మత్తుమందు ఇచ్చి.. మర్మాంగాన్ని కోసేసింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.