ETV Bharat / bharat

'శంతనుకు బెయిల్​పై మీ స్పందనేంటి?'

author img

By

Published : Feb 24, 2021, 1:07 PM IST

టూల్​కిట్​ కేసు నిందితుడు శంతను ములుక్ పిటిషన్​పై దిల్లీ అదనపు సెషన్స్ కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్​ మంజూరుపై అభిప్రాయం తెలపాలని పోలీసులను ఆదేశించింది.

court
బెయిల్​పై మీ అభిప్రాయం చెప్పండి : దిల్లీ కోర్టు

టూల్​కిట్​ కేసు నిందితుడు శంతను ములుక్ ముందస్తు బెయిల్ పిటిషన్​పై స్పందన తెలపాలని దిల్లీ అదనపు సెషన్స్​ కోర్టు పోలీసులను ఆదేశించింది. వర్చవల్​గా బుధవారం చేపట్టిన విచారణలో ములుక్​కు బాంబే హైకోర్టు ఈనెల 16న ట్రాన్సిట్​ బెయిల్​ను మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. బాంబే కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 26 వరకు శంతనును అరెస్ట్​ చేసే హక్కు లేదని స్పష్టం చేసింది.

విచారణ వాయిదా..

కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ప్రస్తుతం హాజరు కాలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి : పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.