ETV Bharat / bharat

Corona Cases India: మరోమారు 20వేల దిగువకు కరోనా కేసులు

author img

By

Published : Oct 9, 2021, 9:15 AM IST

Updated : Oct 9, 2021, 9:49 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. కొత్తగా 19,740 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 248 మంది మృతి చెందారు. తాజాగా 23,070 మంది కరోనాను జయించారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల కనిష్ఠానికి చేరింది.

Corona cases
దేశంలో మరో కేసులు

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. మరోమారు 20వేల దిగువకు చేరుకున్నాయి. కొత్తగా 19,740 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 248 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 23,070 మంది కరోనాను జయించారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల కనిష్ఠానికి చేరింది.

  • మొత్తం కేసులు: 3,39,35,309
  • మొత్తం మరణాలు: 4,50,375
  • మొత్తం కోలుకున్నవారు: 3,32,48,291
  • యాక్టివ్ కేసులు: 2,36,643

పరీక్షలు

శుక్రవారం ఒక్కరోజే 12,69,291 కొవిడ్​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

వ్యాక్సినేషన్​..

శుక్రవారం కొత్తగా 79,12,202 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 93,99,15,323కి చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,44,416 కేసులు నమోదయ్యాయి. 7వేలకుపైగా మరణించారు. అగ్రరాజ్యంలో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది.

దేశంకొత్త కేసులు
అమెరికా1,06,298
యూకే36,060
టర్కీ30,201
రష్యా27,246
బ్రెజిల్18,172
ఉక్రెయిన్​27,191
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated : Oct 9, 2021, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.