ETV Bharat / bharat

ఐఐటీ ఖరగ్​పుర్​లో కరోనా కలకలం- ఆ 60 మందికి..

author img

By

Published : Jan 4, 2022, 3:55 PM IST

Coronavirus Cases In IIT Kharagpur: ఐఐటీ ఖరగ్​పుర్​లో కరోనా వైరస్​ కేసులు భారీగా వెలుగుచూశాయి. సుమారు 60 మందిలో వైరస్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. వారిలో 40మంది విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు.

covid 19
కరోనా వైరస్​

Coronavirus Cases In IIT Kharagpur: ఖరగ్​పుర్​ ఐఐటీ క్యాంపస్​లో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 60 మందికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీరిలో 40 మంది విద్యార్థులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇరవై మందిలో క్యాంపస్​లో నివసించే ఇతరులు ఉన్నట్లు పేర్కొన్నారు.

వైరస్​ సోకిన వారిలో ఎక్కువ మందికి స్వల్పంగా లక్షణాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. లక్షణాలు కనిపించని వారు హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు రిజిస్ట్రార్​ తమల్​ నాథ్​ చెప్పారు. మిగిలిన వారు హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

క్యాంపస్​లోనే ఆసుపత్రి ఉండడం కారణంగా పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపిన తమల్​నాథ్​.. వైద్యులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

"ఐఐటీ ఖరగ్​పుర్​కు చెందిన ప్రతీ ఒక్కరు జ్వరం లాంటి కొవిడ్​ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటికి 60 కేసులు బయటపడ్డాయి. ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు. అదే జరిగితే ఆంక్షలను విధించక తప్పదు. అందుకే మేము చెప్పిన సూచనలను పాటించాలని కోరుతున్నాం."

-తమల్​ నాథ్​, రిజిస్ట్రార్​

డిసెంబర్​ 18న ఐఐటీలో స్నాతకోత్సవం జరిగింది. విద్యార్థులను దశలవారీగా క్యాంపస్​కు తీసుకురావాలని యాజమాన్యం అప్పుడు నిర్ణయించింది. తాజాగా.. వైరస్​ వ్యాప్తి దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్​ తమల్ నాథ్​ తెలిపారు.

ఇదీ చూడండి: Covid Third wave: 'దేశంలో కేసుల పెరుగుదల.. మూడోదశకు సంకేతాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.