ETV Bharat / bharat

విషాదం: కరోనాతో భర్త.. ఆ వార్త విని భార్య మృతి

author img

By

Published : Apr 16, 2021, 7:36 AM IST

కరోనాతో భర్త మరణించాడన్న వార్తను తట్టుకోలేని ఓ భార్య తన మూడేళ్ల కుమారుడితో పాటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో మరో ఇద్దరు సంతానాన్ని అనాథలుగా విడిచి వెళ్లిపోయింది.

Corona positive man dies; wife commits suicide with 3-year-old
కరోనాతో భర్త.. ఆ వార్త విని భార్య మృతి

మహారాష్ట్ర​లోని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రంలో హనమంతు కదమ్ అనే వ్యక్తి కరోనాతో కన్నుమూశాడు. ఈ వార్త విన్న హనుమంతు భార్య పద్మ కదమ్.. తన మూడేళ్ల కుమార్తెతో కలిసి చెరువులోకి దూకి తన జీవితాన్ని ముగించింది. నాందేడ్​కి సమీపంలోని లోహాలో ఈ ఘటన జరిగింది. భార్యభర్తల మరణంతో మరో ఇద్దరు సంతానం అనాథలుగా మారారు.

Corona positive man dies; wife commits suicide with 3-year-old
తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన చిన్నారులు
Corona positive man dies; wife commits suicide with 3-year-old
తల్లితో పాటు మరణించిన కుమారుడు

ఆంధ్రప్రదేశ్​కి చెందిన వీరు మహారాష్ట్రలో కూలీలుగా పని చేసేవారు. ఆ రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులతో ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్ తరహా ఆంక్షలతో వారికి ఉపాధి కరవైంది. ఈ క్రమంలో హనుమంతు కరోనా బారిన పడటం వారి పరిస్థితిని మరింత దిగజార్చింది.

ఇదీ చదవండి: కరోనా పంజా- మహారాష్ట్రలో 61,695మందికి పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.