ETV Bharat / bharat

భారత్​లో కొత్తగా 9వేల కరోనా కేసులు, జపాన్​లో 2లక్షలు

author img

By

Published : Aug 28, 2022, 9:32 AM IST

Updated : Aug 28, 2022, 10:43 AM IST

corona cases in india
corona cases in india

Corona Cases in India భారత్​లో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు

Corona Cases in India : దేశంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 9,436 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 30 మంది కొవిడ్​కు బలయ్యారు. ఒక్కరోజులో 9,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.20 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,08,132
  • క్రియాశీల కేసులు: 86,591
  • మొత్తం మరణాలు: 5,27,754
  • కోలుకున్నవారు: 4,37,93,787

Vaccination In India : దేశంలో ఆదివారం 26,53,964 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,11,66,35,408కు చేరింది. ఒక్కరోజే 3,22,551 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్తగా 527,580 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,216 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 605,328,762 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 64,86,863 మంది మరణించారు. శనివారం మరో 7,52,893 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,95,87,894కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 196,628 కేసులు వెలుగుచూశాయి. మరో 126 మందికిపైగా మరణించారు.
  • దక్షిణ కొరియాలో 95,538 కొవిడ్​ కేసులు, 86 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో 21,986 కొత్త కేసులు, 81 మరణాలు వెలుగుచూశాయి.
  • ఇటలీ, జర్మనీ, తైవాన్, ఫ్రాన్స్​, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి: ట్రక్కు ఢీకొని ఐదుగురు దుర్మరణం, కారు బోల్తా పడి మరో ఐదుగురు

అందరి కళ్లూ నోయిడా జంట భవనాలపైనే, ఏం జరుగుతుందో

Last Updated :Aug 28, 2022, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.