ETV Bharat / bharat

'కాంగ్రెస్​తోనే సచిన్​.. సమస్యలకు త్వరలోనే పరిష్కారం'

author img

By

Published : Jun 12, 2021, 7:47 PM IST

Updated : Jun 12, 2021, 10:17 PM IST

పంజాబ్​ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించినట్టు గానే రాజస్థాన్​లో సచిన్​ పైలట్​, అశోక్​ గహ్లోత్​ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని పార్టీ అధిష్టానానికి పైలట్​ వర్గీయులు సూచించారు. దౌసా జిల్లా భండానాలో తన తండ్రి రాజేశ్‌ పైలట్‌ వర్ధంతి కార్యక్రమానికి శుక్రవారం హాజరైన పలువురు నేతలు సచిన్​ పైలట్​కు అండగా ఉంటున్నట్టు చెప్పారు.

Rajasthan
సచిన్​ పైలట్​

రాజస్థాన్​ కాంగ్రెస్​లో మళ్లీ అసమ్మతి స్వరం వినిపిస్తోందనే వార్తలు ఊపందుకున్నాయి. జితిన్​ ప్రసాద కాంగ్రెస్​నుంచి భాజపాలో చేరిన వెంటనే సచిన్​ పైలట్​ పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తలను ఇప్పటికే కొట్టిపారేశారు సచిన్​ పైలట్​. ఈ క్రమంలో అధిష్టానానికి కీలక సూచనలు చేశారు ఆయన వర్గీయులు. పంజాబ్​ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించినట్టు గానే రాజస్థాన్​లో సచిన్​ పైలట్​, అశోక్​ గహ్లోత్​ మధ్య ఉన్న విభేదాలను అధిష్టానం పరిష్కరించాలని కోరారు.

సచిన్​ పైలట్​ కాంగ్రెస్​తోనే ఉంటారని, అధిష్టానం అప్పగించిన అన్ని పనులను పూర్తి చేస్తారని తెలిపారు ఆయన మద్దతుదారులు. సచిన్​ తరుచుగా పార్టీ హైకమాండ్​తో టచ్​లో ఉంటున్నారని, ఆయన డిమాండ్లు తర్వలోనే పరిష్కారమవుతాయనే నమ్మకం ఉన్నట్లు స్పష్టం చేశారు.

సచిన్‌ పైలట్‌కు పలువురు నాయకులు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. దౌసా జిల్లా భండానాలో తన తండ్రి రాజేశ్‌ పైలట్‌ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు సచిన్​ పైలట్​కు అండగా ఉంటున్నట్టు చెప్పారు. దీంతో మళ్లీ రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో అసమ్మతి చెలరేగినట్టు చాలా మంది భావిస్తున్నారు.

పైలట్ వర్గం లేవనెత్తిన సమస్యలను పరిశీలించడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: Sachin Pilot: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతి!

Last Updated : Jun 12, 2021, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.