ETV Bharat / bharat

మారువేషంలో పోలీస్ స్టేషన్లకు కమిషనర్.. కారణం?

author img

By

Published : May 9, 2021, 11:11 AM IST

krishna prakash
క్రిష్ణ ప్రకాశ్, కమిషనర్

ఓ పోలీసు కమిషనర్.. మటన్​ దుకాణంలో పనిచేసే వ్యక్తిలా వేషం మార్చుకున్నారు. మారువేషంలోనే పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. ఇంతకీ ఆయన వేషం మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే!

పోలీసు అధికారులు తమ విధులు ఎలా నిర్వర్తిస్తున్నారని పరీక్షించేందుకు ఓ కమిషనర్ మారువేషం ధరించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

krishna prakash
మారు వేషంలో కమిషనర్ కృష్ణ ప్రకాశ్

ఇదీ జరిగింది...

పింప్రి చించ్​వడ సిటీలో క్రైమ్ రేట్ ఎక్కువ. ఈ నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు తమ విధులెలా నిర్వర్తిస్తున్నారో తెలుసుకునేందుకు కమిషనర్ కృష్ణ ప్రకాశ్​ మారు వేషంలో స్టేషన్​కు వెళ్లారు. సల్వార్ కమీజ్, తెల్ల టోపీ ధరించి తన లుక్​ని మార్చేశారు. మటన్ దుకాణంలో పనిచేసే వ్యక్తిలా అవతారమెత్తి.. మూడు పోలీసు స్టేషన్లను సందర్శించారు.

తొలుత హింజేవాది పోలీసు స్టేషన్​కు వెళ్లిన కమిషనర్ కృష్ణ ప్రకాశ్.. తన భార్యను అత్యాచారం చేసేందుకు కొందరు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. తర్వాత వకాడ్​ ఠాణాకు వెళ్లి.. కొందరు దుండగులు తన ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. చివరగా పింప్రి పోలీసు స్టేషన్​కు వెళ్లి.. అంబులెన్స్ డ్రైవర్​పై కంప్లైంట్ ఇచ్చారు.

రెండు స్టేషన్లలో పోలీసులు బాగానే స్పందించినప్పటికీ.. ఓ ఠాణాలో చేదు అనుభవం ఎదురైందని కమిషనర్ కృష్ణ ప్రకాశ్ తెలిపారు. సామాన్యుల సమస్యలపై పోలీసులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకునేందుకే ఇలా మారువేషంలో వెళ్లినట్లు చెప్పారు. ఈ మిషన్​లో కమిషనర్​తో పాటు అసిస్టెంట్ కమిషనర్ పేర్న కట్టె, ఆయన భార్య కూడా ఉన్నారు.

ఇదీ చదవండి:బోరుబావిలో గున్న ఏనుగు- స్థానికుల సహాయంతో బయటకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.