ETV Bharat / bharat

నిర్మాణంలోని భవనం పైకప్పు కూలి పలువురికి గాయాలు.. శిథిలాల కింద 12మంది!

author img

By

Published : Dec 31, 2022, 9:15 PM IST

నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలిపోయింది. దాదాపు దాదాపు 12 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. పంజాబ్​లో ఈ ఘటన జరిగింది.

collapsed-roof-of-building-in-panjab
పంజాబ్​లో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం

పంజాబ్​లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలింది. దీంతో పలువురి కార్మికులకు గాయాలయ్యాయి. మొహాలీలోని ఖరార్‌లోని సెక్టార్ 126లో శనివారం ఈ విషాదం జరిగింది. మూడు ప్లోర్​ల భవనానికి పైకప్పు వేస్తున్న సమయంలో హఠాత్తుగా ఈ ఘటన జరిగిందని సమాచారం. దాదాపు 12 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు ప్రారంభించారు.

Collapsed roof of building in panjab
పంజాబ్​లో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.