ETV Bharat / bharat

PV Narasimha Rao Birth Anniversary : 'క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ'

author img

By

Published : Jun 28, 2023, 1:30 PM IST

Updated : Jun 28, 2023, 3:11 PM IST

Political Leaders Tribute To PV Narasimharao
Political Leaders Tribute To PV Narasimharao

CM KCR tribute to PV Narasimha Rao : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 102వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు.. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. పీవీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. పీవీ చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకోవాలన్న సీఎం.. ఆయన స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

'క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ'

Political Leaders tribute to PV Narasimha Rao : రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖులు పీవీకి ఘన నివాళులు అర్పించారు. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు.

CM KCR tribute to PV Narasimha Rao : స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు పీవీ అని కేసీఆర్ కొనియాడారు. తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ప్రదర్శిస్తూ.. దేశానికి మౌనంగా మేలు చేసిన మహనీయుడు అని తెలిపారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ బిడ్డ నరసింహారావుకే దక్కుతుందని కేసీఆర్ అన్నారు. పీవీ సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన మీద ఉందన్న ముఖ్యమంత్రి.. వారి గొప్పతనాన్ని గుర్తుంచుకునేందుకు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. 'తెలంగాణ ఠీవి.. మన పీవీ' అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పీవీ నరసింహారావు స్ఫూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

  • ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. దేశాన్ని ప్రగతి పథంలో నడపడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన సేవలను భారత జాతి ఎప్పటికీ మర్చిపోదు. ప్రజాసేవ, సాహిత్య సేవల్లో… pic.twitter.com/UGLyEHZINs

    — N Chandrababu Naidu (@ncbn) June 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PV Narasimharao Birth Anniversary : పీవీ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మేధావి పీవీ అని పేర్కొన్నారు. పీవీ సేవలను భారత జాతి ఎప్పటికీ మర్చిపోదన్నారు. ప్రజాసేవ, సాహిత్య సేవల్లో తనదైన ముద్రవేశారని స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు తెలుగువారు కావడం గర్వకారణమని చంద్రబాబు చెప్పారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి మార్గదర్శకంగా నిలిచారని రాష్ట్ర మంత్రులు కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారత రత్న ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ జ్ఞానభూమి వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌, సత్యవతి రాఠోడ్, మహమూద్‌ అలీ నివాళులర్పించారు. పీవీకి భారత రత్న తీసుకురావడంపై పోరాడతామని.. పార్లమెంట్‌లో గళమెత్తుతామని తలసాని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు పీవీ స్ఫూర్తిదాయమని సత్యవతి రాఠోడ్ అన్నారు. తెలంగాణ గడ్డపై పీవీ జన్మించడం అదృష్టమని తెలిపారు.

భారత రత్న తర్వాత విషయమని ముందుగా సీఎం కేసీఆర్ వచ్చి పీవీకి నివాళులర్పించమని చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ హితవు పలికారు. పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద.. బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీర్తిని చాటి చెప్పేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది తప్పితే.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. పీవీ నరసింహారావు బహు భాషా కోవిదుడని కొనియాడారు. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిన యోధుడని తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు.

మరోవైపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి కాంగ్రెస్‌ నాయకులు నివాళులు అర్పించారు. పీవీ నరిసింహారావు దేశానికి, తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలను వారు కొనియాడారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 28, 2023, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.