ETV Bharat / bharat

శ్రీ రామ నామాలు జమ చేసే బ్యాంక్​ - ఖాతాదారులకు సర్టిఫికెట్- ఎక్కడ ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 2:59 PM IST

Chhattisgarh Shri Sitaram Naam Bank
Chhattisgarh Shri Sitaram Naam Bank

Ram Naam Bank in Chhattisgarh : పేరుకే అది బ్యాంక్. కానీ అక్కడ ఎలాంటి లావాదేవీలు జరగవు. కానీ ఆ శాఖకు మేనేజర్​, అధికారులు ఇలా అందరూ ఉంటారు. అయితే అక్కడ నగదుకు బదులు రామనామాలు రాసిన కాపీలను స్వీకరిస్తుంటారు. ఈ వింత బ్యాంక్​ ఎక్కడ ఉంది? దాని విశేషాలు ఎంటో ఓ సారి చూద్దామా.

రామ నామలతో ఖాతా - ఖాతాదారులకు సర్టిఫిక్టేట్​ - ఆ బ్యాంక్​ ప్రత్యేకత ఏంటంటే ?

Ram Naam Bank in Chhattisgarh : సాధారణంగా బ్యాంకుల్లో డబ్బులు జమచేయడం, రుణాలు ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి. కానీ, ఛత్తీస్​గఢ్​లోని ఓ బ్యాంక్​ మాత్రం నగదు లావాదేవీలకు బదులుగా రామ నామాల కాపీలను స్వీకరిస్తోంది. సుమారు 700 మంది ఖాతాదారులతో నడిచే ఈ బ్యాంక్​లో ఇప్పటివరకు వంద కోట్లకు పైగా రామనామాలు జమ అయ్యాయి.

'శ్రీ సీతారామ్​ నామ్' పేరుతో ఈ బ్యాంకును 2018లో ప్రారంభించారు. ఇందులో ఖాతాను ప్రారంభించాలనుకునే రామ భక్తులు తొలుత తమ పేరును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంకు అధికారులు వారికి పది పేజీలు గల రామ నామాలు రాసే ఓ కాపీతో పాటు ఓ పెన్​ను అందిస్తారు. వీటిని తీసుకున్న ఖాతాదారులు సీతారాముల నామాలను రాసి ఆ కాపీని బ్యాంక్​లో జమ చేస్తుంటారు. వీటన్నింటిని బ్యాంక్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారు. ఇక్కడ రామనామాల కాపీలను స్వీకరించడమే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసంశా పత్రాన్ని కూడా అందజేస్తుంటారు.

"భక్తులు ఇక్కడ కాపీలను తీసుకుని వెళ్లి రామనామాలు రాస్తారు. ఆ తర్వాత వాటిని తిరిగి జమ చేస్తారు. అనంతరం వారికి మరో కొత్త కాపీని అందజేస్తాము. ఈ బ్యాంక్​ను 2018లో ప్రారంభించాము. ఈ 6-7 సంవత్సరాలలో రామనామాల సంఖ్య సుమారు 100 కోట్ల వరకు చేరుకుంది".
-- పురుషోత్తం ప్రసాద్ సోనీ, శ్రీ సీతారామ్​ నామ్​ బ్యాంక్ మేనేజర్

"ఈ బ్యాంక్ ప్రారంభమైన సమయంలో అందరూ దీని గురించే అడిగేవారు. ఇక్కడ దేవుడి పేరును రాసి జమ చేస్తారు. ప్రస్తుతం ఈ బ్యాంక్​లో సుమారు 600 నుంచి 700 మంది ఖాతాదారులు ఉన్నారు"
-- మదన్ తివారీ, స్థానికుడు

తాజాగా ఈ బ్యాంక్​ ప్రతినిధులకు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. దీనిపై సీతారామ్​ నామ్ బ్యాంక్ అధికారులు, ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో బ్యాంక్ పరిసర ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోసం బ్యాంక్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మేనేజర్ చెప్పారు.

అయోధ్య రామాలయం కోసం మౌనవ్రతం- పదేళ్ల వయసులో ప్రతిజ్ఞ- ప్రాణప్రతిష్ఠ రోజు విరమణ!

రామనామాల బ్యాంక్​- దేశవ్యాప్తంగా శాఖలు- అగ్నిప్రమాదం జరిగినా సేఫ్​గా రికార్డులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.