ETV Bharat / bharat

'5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే వ్యూహం పాటిస్తే సరి'

author img

By

Published : Jan 29, 2021, 3:16 PM IST

కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోకముందే దేశం మరోసారి ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే బిహార్ ఎన్నికలను విజయవతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం మరో ఘట్టానికి తెరతీయబోతోంది. ఈ నేపథ్యంలో ముందున్న సవాళ్లు, ఎన్నికల నిర్వహణపై భారత మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ​ఓం ప్రకాశ్​ రావత్​ ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో కీలక విషయాలు పంచుకున్నారు.

Challenges of election during the coronavirus pandemic
'ఎన్నికల నిర్వహణకు వారి సమన్వయంమే కీలకం'

దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అయితే.. ప్రస్తుతం దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వాలకు, ఎన్నికల సంఘాలకు సవాలే. కొవిడ్​ ఉద్ధృతి అధికంగా ఉన్న సమయంలోనే బిహార్​ శాసన సభ ఎన్నికలను సజావుగా నిర్వహించి ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసింది కేంద్ర ఎన్నికల సంఘం. అప్పుడైతే కేవలం ఒకే రాష్ట్రం. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. మొత్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ, అధికారులతో సమన్వయం, ఈవీఎంల్లో ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, ముఖ్యంగా కరోనా లాంటి ఎన్నో అంశాలు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ముందున్నాయి. వీటిపై భారత మాజీ ప్రధాన ఎన్నికల అధికారి ఓం ప్రకాశ్​ రావత్​.. ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు.

కొవిడ్​ వ్యాప్తి కొనసాగుతోన్న వేళ అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని ఎలా చూడాలి?

కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయా రాజకీయ పార్టీలతో ఇప్పటికే సమావేశం అయ్యింది. నామినేషన్ పత్రాల దాఖలు, ప్రచారం, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో ఒక పోలింగ్ బూత్‌కు వేయి మంది కంటే తక్కువ ఓటర్లను కేటాయించింది. ఆ కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. బిహార్​ ఎన్నికల సమయంలో కరోనా నిబంధనలను కఠినంగా పాటించింది. బంగాల్​, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తే సరిపోతుంది.

'ఎన్నికల నిర్వహణకు వారి సమన్వయంమే కీలకం'

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి?

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు వేరు వేరుగా ఏర్పడ్డాయి. రాజ్యాంగంలో వారి విధులను స్పష్టంగా పేర్కొన్నారు. ఇద్దరికీ వేర్వేరు బాధ్యతలు ఉంటాయి. రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రధానాధికారి ఉంటారు. ఆయన ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా రిటర్నింగ్​ అధికారులు ఉంటారు. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఆయా శాఖలు వారివారి పనులు ప్రారంభిస్తారు.

వలస కార్మికులు ఓట్లు వియోగించుకోవడానికి ఎన్నికల సంఘం సంస్కరణలు చేపట్టబోతోందా?

వలస కార్మికులు, ప్రవాస భారతీయులు ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఎన్నికలు సంఘం ఇప్పటికే దృష్టిసారించింది. అందుకు తగిన విధంగా ఈ-బ్యాలెట్​పై ప్రభుత్వానికి ఈసీ సిఫార్సులు చేసింది. అమలులోకి తీసుకురావడం కోసం అందరం ఎదురుచూస్తున్నాం.

అభ్యర్థుల నేర చరితను ప్రచురించడం మంచిదేనా?

ఎన్నికల్లో పోటీ చేసేవారు వారివారి నేర చరితను ప్రచురించాలి అని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చేవారిని కొంతమేరుకు అయినా కట్టడి చేయగలం అనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంది. దీన్నే బిహార్​ ఎన్నికల్లో పాటించారు. ఇదేం మొదటిసారి కాదు.

ఎన్నికల కమిషనర్​ పాత్ర ఎలా ఉండాలి?

ఈవీఎంలను చూసుకునే పూర్తి బాధ్యత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్​దే. ఇందులో వారిది కీలక పాత్ర. ఎందుకంటే వారు ఏ నివేదికను అయినా కోర్టులో మాత్రమే సమర్పించాలి. రాజకీయ పార్టీల నమ్మకం పొందాలంటే వారికి ప్రతీది వివరించాలి. అటువంటి పరిస్థితిలో సంబంధిత వ్యక్తిని పొడిగించాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తుంది. భారత ప్రభుత్వం ఈ అభ్యర్థనను అంగీకరించి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అయితే ఎన్నికల సంఘానికి వచ్చిన అధికారులు నిర్ణీత కాలానికి వస్తారు. తన రాజకీయ తటస్థతను చూసిన తర్వాతే ఈసీ వారిని ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలోనే ఉమేష్ సిన్హా సేవలను మరో ఏడాది పాటు పొడిగించారు. ఇక్కడ మరో విషయంపై మాట్లాడుకోవాలి. మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా 2020 లో తన పదవికి రాజీనామా చేశారు. తరువాత ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షుడిగా చేరారు. అయితే అలాంటి గొప్పస్థానంలో ఉండడం నిజానికి గొప్పవిషయం. అందుకే ఆయన అలా చేశారు.

ఎన్నికల ప్రక్రియలో అధికారులు, పార్టీ నాయకుల పాత్ర ఏమిటి?

ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈవీఎం, వీవీపాట్​లు లెక్కంపు, ప్రవర్తనా నియమావళి విషయంలో ప్రతిసారీ విమర్శలు వస్తుంటాయి. వీటిపై అధికారులు పూర్తి చిత్తశుద్ధితో, నిజాయతీగా పని చేయాడానికి ప్రయత్నిస్తారు. ఇక పార్టీ నాయకులు విషయానికి వస్తే.. వారు ఓట్లను పోగుచేసుకోవడం కోసం నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వాటిపై ఎన్నికల కమిషన్ దర్యాప్తు జరిపుతుంది.

ఇదీ చూడండి: 'గందరగోళం వద్దు- ఇప్పుడున్నదీ ఒకే ఓటరు జాబితా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.