ETV Bharat / bharat

బిహార్​ బరి: ఎన్నికల ప్రచారానికి తెర

author img

By

Published : Nov 5, 2020, 6:01 PM IST

బిహార్​ మూడో దశ పోలింగ్​ జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. నవంబర్​ 7న 19 జిల్లాల్లోని 78 స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. అసెంబ్లీ స్పీకర్​ విజయ్​ కుమార్​ చౌదరి సహా పలువురు మంత్రులు, కీలక నేతలు బరిలో ఉన్నారు.

Bihar assembly polls
బిహార్​ మూడోదఫా ఎన్నికల ప్రచారానికి తెర

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్​ జరిగే నియోజకవర్గాల్లో ప్రచార గడువు ముగిసింది. ఈనెల 7న 78 స్థానాల్లో ఓటింగ్​ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 2.35 కోట్ల మంది ఓటర్లు 1,200 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

  • ఎన్నికలు జరుగుతున్న జిల్లాలు: 19
  • మొత్తం సీట్లు: 78
  • మొత్తం ఓటర్లు: 2.35 కోట్లు
  • అభ్యర్థులు: 1,200
  • పోలింగ్​ కేంద్రాలు: 33,500

కీలక నేతలు..

మూడో విడతలో బరిలో నిలిచిన వారిలో కీలక నేతలు ఉన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్​ విజయ్​ కుమార్​ చౌదరి, రాష్ట్ర మంత్రులు సురేశ్​ శర్మ, ప్రమోద్​ కుమార్ మరోమారు తమ స్థానాన్ని పదిలపరుచుకోవాలని చూస్తున్నారు. వారితో పాటు కేంద్ర మాజీ మంత్రి శరద్​ యాదవ్​ కుమార్తె సుభాషిణి యాదవ్​ కాంగ్రెస్​ తరఫున బిహార్​గంజ్​ నుంచి బరిలో నిలుస్తున్నారు.

10న ఫలితం

243 సీట్లకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్టోబర్​ 28న తొలిదశ పూర్తి కాగా.. నవంబర్​ 3న రెండో దఫా ఎన్నికలు పూర్తయ్యాయి. తుది దశ తర్వాత ఈనెల 10న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.

ఎన్​డీఏలో.. భాజపా, జేడీయూ, హిందుస్థానీ అవామ్ మంచ్, వికాశ్​శీల్​ ఇన్సాన్​ పార్టీ ఉన్నాయి. భాజపాతో సన్నిహితంగా ఉన్న లోక్​జనశక్తి పార్టీ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగింది. మహాకూటమిలో ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: 'మంచి పాలనకే బిహార్​ ప్రజలు ఓటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.