ETV Bharat / bharat

టేకాఫ్​కు సిద్ధమైన విమానానికి బాంబు బెదిరింపు.. ఫేక్ కాల్​గా గుర్తింపు

author img

By

Published : Jan 12, 2023, 8:33 PM IST

Updated : Jan 12, 2023, 10:15 PM IST

spicejet bomb threat
spicejet bomb threat

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్​కు సిద్దంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానానికి బాంబు బెదిరింపు కాల్​ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎటువంటి అనుమానిత వస్తువులు దొరకలేదని.. భద్రతా కారణాల దృష్ట్యా పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు అది ఫేక్ కాల్​గా తేల్చారు.

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్​కు సిద్దంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానానికి బాంబు బెదిరింపు కాల్​ వచ్చింది. వెంటనే అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని.. భద్రతా కారణాల దృష్ట్యా పూర్తిగా తనిఖీలు చెప్పట్టినట్లు అధికారులు వెల్లడించారు.

గురువారం సాయత్రం దిల్లీ నుంచి పుణె వెళ్లే స్పైస్​జెట్ విమానం​లో బాంబు ఉందని ఓ అగంతకుడు నుంచి కాల్​ వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రయాణికులు బోర్డింగ్ గేట్ వద్ద ఉన్నారని.. విమానంలోకి ఎవరూ ఎక్కలేదని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగానే ఉన్నట్లు వెల్లడించారు. ఆ కాల్​ చేసిన వ్యక్తిని కనిపెట్టి.. అది బూటకపు ​కాల్​గా తేల్చే పనిలో ఉన్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తనిఖీల్లో విమానంలో బాంబు లేదని అది ఫేక్​ కాల్​గా తేల్చారు విమానాశ్రయ అధికారులు. అనంతరం ఆ స్పైస్​జెట్​ విమానం కాస్త ఆలస్యంగా దిల్లీ నుంచి పుణెకు బయలుదేరింది.

Last Updated :Jan 12, 2023, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.