ETV Bharat / bharat

Buffalo Theft Case : 58 ఏళ్ల క్రితం కేసులో 78 ఏళ్ల వృద్ధుడు అరెస్ట్​.. 1965లో గేదెలను చోరీ చేశాడని..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 7:30 PM IST

buffalo theft case
buffalo theft case

Buffalo Theft Case : 58 ఏళ్ల క్రితం నాటి గేదెలను దొంగలించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు కర్ణాటక బీదర్ పోలీసులు. ఈ చోరీ 1965లో జరగగా.. తాజాగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.

Buffalo Theft Case : 1965 నాటి ఓ కేసులో కేసులో నిందితుడిని పట్టుకున్నారు కర్ణాటక పోలీసులు. 58 ఏళ్ల తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు బీదర్​లోని మేఖార్ పోలీసులు. 20 ఏళ్ల వయసులో గేదెలను దొంగతనం చేయగా.. తాజాగా 78 ఏళ్ల వయసులో పట్టుకున్నారు.

ఇదీ జరిగింది
1965లో మేఖార్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని మురళీధర్​రావు కులకర్ణికి చెందిన రెండు గేదెలు, ఒక దూడ కనిపించకుండా పోయాయి. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన కిషన్​ చందర్​, గణపతి వాఘ్మోర్​ను పట్టుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో ప్రవేశపెట్టి.. జైలుకు తరలించారు. అనంతరం కొద్ది రోజులకు బెయిల్​పై బయటకు వచ్చిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. కోర్టు ఎన్నిసార్లు సమన్లు, వారెంట్లు జారీ చేసినా.. పట్టించుకోలేదు. కేసు విచారణలో ఉండగానే మొదటి నిందితుడు కిషన్ చందర్​ చనిపోవడం వల్ల అతడిపై కేసును కొట్టివేశారు. మరో నిందితుడు గణపతి మాత్రం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే, తాజాగా పెండింగ్​లో ఉన్న కేసుల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. ఈ దొంగతనం చేసిన సమయంలో గణపతి వయసు 20 సంవత్సరాలు కాగా.. ఇప్పుడు 78 ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యాడు.

"ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిని సైతం పట్టుకుని న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నాం. ఈ బృందం తాజాగా 58 ఏళ్ల నాటి క్రితం కేసును ఛేదించింది. 78 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. ఇలాంటి మరో 7 కేసులను ఈ బృందం పరిష్కరించింది."

--చెన్నబసవన్న, ఎస్​పీ బీదర్​

అంతకుముందు రెండు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 1988 నాటి ఓ కేసులో దోషికి 383 సంవత్సరాల జైలు శిక్ష విధించింది తమిళనాడులోని కోయంబత్తూర్ న్యాయస్థానం. అక్రమ పత్రాలు సృష్టించి ప్రభుత్వ బస్సులను వేలం వేసిన కేసులో శిక్షతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధించింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవినీతి కేసులో 35 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తీర్పు

10 ఏళ్ల బాలుడి హత్య.. 29 ఏళ్ల తర్వాత తీర్పు.. దోషికి జీవిత ఖైదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.