ETV Bharat / bharat

అవినీతి కేసులో 35 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తీర్పు

author img

By

Published : Jan 11, 2022, 2:19 PM IST

Corruption charges: అవినీతి ఆరోపణల కేసులో ఓ వ్యక్తిని నిర్దోషిగా తేల్చుతూ.. తీర్పు వెలువరించింది బాంబే హైకోర్టులోని నాగ్​పుర్​ బెంచ్​. ఈ కేసు నమోదైన 35 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేలటం గమనార్హం. ఈ అలుపెరగని పోరాటంలో విజయం సాధించినా.. నిందితుడి సగం జీవితం కోర్టుల చుట్టూ తిరిగేందుకే గడిచిపోయింది.

corruption charges
బాంబే హైకోర్టు

Corruption charges: సత్యం ఎప్పటికీ ఓడిపోదు అన్న మహాత్మా గాంధీ మాటకు నిదర్శనం ఈ సంఘటన. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి 35 ఏళ్ల తర్వాత విముక్తి లభించింది. ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తూ నిర్దోషిగా తీర్పు చెప్పింది బాంబే హైకోర్టులోని నాగ్​పుర్​​ బెంచ్​. తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడేందుకు తన సగం జీవితం కోర్టుల చుట్టూ తిరిగారు మహారాష్ట్రలోని నాగ్​పుర్​కు చెందిన 76 ఏళ్ల రామ్​ ధీరజ్​ రాయ్​.

ఏం జరిగింది?

రామ్​ ధీరజ్​ రాయ్​.. 1987లో 35 వెస్టర్న్​ కోల్​ లిమిటెడ్​ చీఫ్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా విధులు నిర్వర్తించారు. మహారాష్ట్రలోని కమతి ప్రాంతంలో 25 పడకల ఆసుపత్రి కట్టేందుకు వెస్టర్న్​ కోల్​ లిమిటెడ్​ టెండర్లు ఆహ్వానించింది. ఆ కాంట్రాక్టు ఓ ప్రైవేటుకు సంస్థకు అప్పగించింది. తర్వాత ఆ కాంట్రాక్టును రద్దు చేసి.. ఇండస్​ ఇంజినీరింగ్​ సంస్థకు ఇచ్చారు.

ఈ వ్యవహారంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రాగా.. సంస్థలో అప్పటి చీఫ్​ ఫైనాన్సింగ్​, అకౌంట్స్​ అధికారి డి. జనార్ధన్​ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇండస్​ ఇంజినీరింగ్​ సంస్థకు కాంట్రాక్ట్​ ఇవ్వాలని తనపై రామ్​ ధీరజ్​ రాయ్​ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. దీంతో రాయ్​తో పాటు ఇండస్​ సంస్థ యజమానిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.

తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు ధీరజ్​ రాయ్​. సంవత్సరాల పాటు పోరాటం సాగించారు​. తమ సంస్థ ఫైనాన్సింగ్​ అధికారిపై ఒత్తడి తెచ్చేందుకు తనకు ఎలాంటి అధికారాలు లేవని, జనార్ధన్​ రావుకే కాంట్రాక్టుల కేటాయింపులపై పూర్తి అధికారం ఉంటుందని కోర్టుకు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన ధర్మాసనం.. ఆయనను నిర్దోషిగా తేల్చింది.

ఇదీ చూడండి:

చేయని నేరానికి జైలులోనే 43 ఏళ్లు.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.