ETV Bharat / bharat

'బదాయూ' ప్రధాన నిందితుడు అరెస్ట్

author img

By

Published : Jan 8, 2021, 8:28 AM IST

Budaun gangrape: Main accused arrested
బదాయూ అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్ట్

బదాయూ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఉగైతీ పోలీస్​స్టేషన్​ పరిధిలో సహచరుని ఇంట్లో తలదాచుకున్న నిందితున్ని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్​ ప్రశాంత్​ కుమార్​ వెల్లడించారు.

సహచరుడి ఇంట్లో నక్కి..

50 ఏళ్ల మహిళను అత్యాచారం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సత్య నారాయణ ఇంతకాలం పరారీలో ఉన్నాడు. ఉగైతీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని అతని సహచరుని ఇంట్లో తల దాచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. పక్కా సమాచారంతో అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

పాశవికంగా..

ఈ నెల 3న బదాయూ జిల్లా, ఉగైతీ ప్రాంతంలో 50ఏళ్ల మహిళా అంగన్​వాడీ కార్యకర్తపై అత్యాచారం జరిగింది. దేవుడి దర్శనం కోసం ఓ ఆలయానికి వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. నిందితులైన ఆలయ పూజారి, అతని ఇద్దరు శిష్యులపై ఉగైతీ పోలీస్​ స్టేషన్​లో ఐపీసీ సెక్షన్​ 376-డీ(సామూహిక అత్యాచారం), 302(మర్డర్​)కింది కేసు నమోదు చేశారు. ఇదివరకే ఇద్దరు శిష్యులను అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.