ETV Bharat / bharat

రూ.కోటి విలువైన బ్రౌన్​షుగర్​ పట్టివేత

author img

By

Published : Mar 10, 2021, 4:49 PM IST

Updated : Mar 10, 2021, 5:27 PM IST

ఒడిశాలో భారీ స్థాయిలో బ్రౌన్​ షుగర్​ను పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ రూ.కోటికి పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఓ యువకుడిని అరెస్ట్​ చేసినట్టు చెప్పారు.

Brown Sugar Worth Over 1 Crore Seized In Odisha
రూ.1కోటి విలువైన బ్రౌన్​షుగర్​ పట్టివేత- యువకుడు అరెస్ట్​

ఒడిశాలో భారీ స్థాయిలో బ్రౌన్​షుగర్​ బయటపడింది. బాలేశ్వర్​ జిల్లా, జలేశ్వర్​ ప్రాంతంలోని లక్ష్మణ్ నాథ్​ చెక్​పోస్ట్​ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఆ రాష్ట్ర ప్రత్యేక టాస్క్​ ఫోర్స్​(ఎస్​టీఎఫ్​) అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు సుమారు రూ.కోటికి పైగా విలువ చేసే బ్రౌన్​షుగర్​ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి షేక్​ మునాఫ్​ హుస్సేన్​ అనే యువకుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. అతడిపై విచారణ చేపట్టారు.

భువనేశ్వర్‌కు చెందిన ఎస్‌టీఎఫ్‌ బృందం.. గత రెండు రోజులుగా జలేశ్వర్ ప్రాంతంలో పహారా కాస్తోంది. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సాగిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించి.. ఓ యువకుడి వద్ద నుంచి 1.5 కిలోల బ్రౌన్​ షుగర్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: యాంటీలియా వద్ద బాంబుల కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు

Last Updated : Mar 10, 2021, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.