ETV Bharat / bharat

భారత్​లో బూస్టర్​ డోస్​కు శాస్త్రవేత్తల సిఫార్సు- వారికే ముందు!

author img

By

Published : Dec 3, 2021, 3:26 PM IST

booster dose in India
బూస్టర్​ డోస్​కు శాస్త్రవేత్తల సిఫార్సు

Booster dose in India: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ఆందోళనల నేపథ్యంలో 40 ఏళ్లుపైబడిన వారికి బూస్టర్​ డోస్​ ఇవ్వాలని సూచించింది భారత జినోమిక్స్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం-ఇన్​సాకాగ్. ముందుగా రిస్క్​ ఎక్కువగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు.. ఆరు వ్యాక్సిన్ల బూస్టర్​ డోస్​ సురక్షితమేనని లాన్సెట్​ అధ్యయనం వెల్లడించింది.

Booster dose in India: ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా వ్యాపిస్తుందన్న భయాల నేపథ్యంలో కీలక సిఫార్సులు చేశారు భారత అగ్రశ్రేణి జినోమ్​ శాస్త్రవేత్తలు. 40 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్​-19 వ్యాక్సిన్​ బూస్టర్​ డోస్​ ఇవ్వాలని సూచించారు. వైరస్​ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

ఈ మేరకు భారత సార్స్​-కోవ్​-2 జినోమిక్స్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం(ఇన్​సాకాగ్) వీక్లీ బులిటెన్​లో ఈ సిఫార్సులు చేశారు శాస్త్రవేత్తలు.

"ఎట్​ రిస్క్​ జాబితాలో ఉండి ఇప్పటికీ టీకా తీసుకోనివారికి వ్యాక్సినేషన్​ పూర్తి చేయాలి. 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్​ డోస్​ ఇవ్వాలి. ముందుగా హై రిస్క్​ ఉన్నవారికి ప్రాధాన్యం కల్పించాలి. ప్రస్తుత వ్యాక్సిన్ల యాంటీబాడీలు ఒమిక్రాన్​ను తటస్థం చేసేందుకు సరిపోవు. కానీ, తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా చేయగలవు. "

- జినోమ్​​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో లోక్​సభలో పలువురు సభ్యులు బూస్టర్​ డోసుల పంపిణీ ప్రారంభించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తల సిఫార్సులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త వేరియంట్​ను తొలినాళ్లలోనే గుర్తించేందుకు జినోమ్​ నిఘా కీలకమని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. అవసరమైన ప్రజా ఆరోగ్య చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆ వ్యాక్సిన్ల బూస్టర్​ డోస్​లు సురక్షితమే: లాన్సెట్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు కొవిడ్​-19 వ్యాక్సిన్ల బూస్టర్​ డోసులు సురక్షితమేనని, ఇప్పటికే రెండు డోసుల ఆస్ట్రాజెనెకా, ఫైజర్​ టీకాలు తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతున్నట్లు లాన్సెట్​లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది. రెండు డోసుల ఆస్ట్రాజెనెకా, ఫైజర్​ టీకాలు ఆసుపత్రిలో చేరటం, మరణాల నుంచి ఆరు నెలల తర్వాత కూడా 79 శాతం, 90 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలంలో కొవిడ్​-19 నుంచి రక్షణ తగ్గిపోతుందని, వ్యాధి బారినపడే ప్రమాదం ఉన్నవారిని రక్షించేందుకు, ఆరోగ్య సేవలపై ఒత్తిడి తగ్గించేందుకు బూస్టర్​ డోసులు అవసరమవుతున్నాయని తెలిపారు.

మూడో డోస్​గా ఇచ్చిన ఏడు వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు, రోగనిరోధక వ్యవస్థ స్పందన, భద్రత వంటి అంశాలను పరిశీలించింది తాజా అధ్యయనం. ఇందులో ఆస్ట్రాజెనెకా, ఫైజన్​-బయోఎన్​టెక్​, నోవావాక్స్​, జాన్సన్​, మోడెర్నా, వాల్నెవా, కురెవాక్​ టీకాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: Omicron treatement: గుడ్​ న్యూస్​.. ఒమిక్రాన్​కు చికిత్స రెడీ!

Omicron worldwide: ఒమిక్రాన్‌.. ఏ దేశంలోకి ఎప్పుడు?

విస్తరిస్తున్న 'ఒమిక్రాన్​'- భయం గుప్పిట్లో ఆ దేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.