ETV Bharat / bharat

పడవ బోల్తా.. 14 మంది గల్లంతు

author img

By

Published : Feb 24, 2022, 10:07 PM IST

Updated : Feb 25, 2022, 11:23 AM IST

Boat capsizes: పడవ బోల్తా పడి 14 మంది గల్లంతైన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైనవారి కోసం విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

Boat capsizes in Jharkhand
Boat capsizes in Jharkhand

Boat capsizes: ఝార్ఖండ్‌లో జామ్​తాడా జిల్లాలో పడవ బోల్తా పడి 14 మంది గల్లంతయ్యారు. బరాకర్ నదిలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో పడవలో 20 నుంచి 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పడవలో ఉన్నవారంతా కూరగాయ విక్రయించే చిరు వ్యాపారలేనని పేర్కొన్నారు.

జామ్​తాడా నుంచి నిర్సాకు వెళ్తుండగా గురువారం సాయంత్రం నది మధ్యలో పడవ బోల్తా పడినట్లు. అధికారులు తెలిపారు. తుపాను కారణంగా బార్బెండియా వంతెన వద్ద పడవ ప్రమాదం జరిగిందని చెప్పారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నిర్వహణ దళాలు(ఎన్​డీఆర్‌ఎఫ్‌) ఘటనాస్థలికి చేరుకుని నలుగురిని కాపాడగలిగాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మత్స్యకారులు, స్థానికులు ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పెళ్లి కాలేదని వెళితే.. తల్లీకూతుళ్లపై రెండేళ్లుగా బాబా అత్యాచారం!

Last Updated : Feb 25, 2022, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.