ETV Bharat / bharat

'నూహ్ అల్లర్ల కేసు నిందితుడి సోదరుడిపై దాడి- చికిత్స పొందుతూ మృతి'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 2:14 PM IST

Bittu Bajrangi Brother Dead : దుండగుల దాడిలో గాయపడ్డ తన సోదరుడు మహేశ్ పాంచల్ చనిపోయినట్లు హరియాణాకు చెందిన గో సంరక్షకుడు, నూహ్ అల్లర్ల కేసు నిందితుడు బిట్టూ బజరంగీ తెలిపాడు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాడు. అయితే, అతడి మృతిపై తమకు సమాచారం లేదని పోలీసులు చెప్పడం గమనార్హం.

Bittu Bajrangi Brother Dead
Bittu Bajrangi Brother Dead

Bittu Bajrangi Brother Dead : హరియాణాకు చెందిన గో సంరక్షకుడు, నూహ్ అల్లర్ల కేసు నిందితుడు బిట్టూ బజరంగీ సోదరుడు మహేశ్ పాంచల్​ దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ చనిపోయాడు. గతేడాది డిసెంబర్​లో దుండగుల దాడిలో మహేశ్​కు కాలిన గాయాలు అయ్యాయని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వాదనను పోలీసులు ఖండిస్తున్నప్పటికీ- కొందరు దుండగులు మహేశ్ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని చెబుతున్నారు. కాలిన గాయాలకు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలకు ప్రాణాలు కోల్పోయాడని బిట్టూ బజరంగీ వివరించాడు. అయితే, అతడి మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు.

"డిసెంబర్ 13 అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వస్తుండగా కొందరు నన్ను అడ్డగించారు. 'నువ్వు బిట్టూ బజరంగీ సోదరుడివేనా?' అని అడిగారు. అవును అని నేను చెప్పగానే దాడి చేశారు. నా ఒంటిపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఒంటికి మంటలు అంటుకున్నా అరుస్తూనే ఇంటికి వచ్చా. గట్టిగా గేటును కొట్టాను. వెంటనే కుటుంబ సభ్యులంతా గేటు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు" అని దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స సందర్భంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు మహేశ్.

కాలిన గాయాలతో ఉన్న మహేశ్​కు ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు బాద్​షా ఖాన్ ఆస్పత్రికి సిఫార్సు చేశారని అతడి కుటుంబీకులు తెలిపారు. అక్కడి నుంచి దిల్లీ ఎయిమ్స్​కు తరలించినట్లు చెప్పారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు దిగజారుతూ వచ్చిందని, చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

bittu bajarangi brother dead
బిట్టూ బజరంగీ సోదరుడు మహేశ్ పాంచల్

'అది దాడి కాదు'
అయితే, పోలీసులు మాత్రం మహేశ్​పై దాడి జరిగిందన్న వాదనను కొట్టిపారేశారు. చలిమంటలో పడిపోవడం వల్లే మహేశ్​కు కాలిన గాయాలు అయ్యాయని చెబుతున్నారు. అతడిపై హత్యాయత్నం జరిగిందనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పాంచల్ మరణం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఈ కేసుపై ఏర్పాటైన సిట్ అధిపతి ఏసీపీ అమన్ యాదవ్ వెల్లడించారు.

నూహ్ అల్లర్ల నిందితుడు బజరంగ్
గోరక్షక్ బజరంగ్ దళానికి బిట్టూ నేతృత్వం వహిస్తున్నాడు. గతేడాది హరియాణాలోని నూహ్ జిల్లాలో జరిగిన అల్లర్లలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దాడి, ఆయుధాల ప్రయోగం, దోపిడీ వంటి అభియోగాల మీద అతడిపై కేసు నమోదైంది. రెచ్చగొట్టే వీడియోలను రిలీజ్ చేశారని బజరంగీని పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం బెయిల్​పై బయట ఉన్నాడు.

bittu bajarangi
బిట్టూ బజరంగీ

నాలుగేళ్ల కుమారుడిని చంపిన లేడీ CEO- సూట్​కేస్​లో మృతదేహంతో ట్యాక్సీలో పరారీ- చివరకు అరెస్ట్

డబ్బు కోసం స్నేహితుడి హత్య- పొలంలో పూడ్చేసి మూడేళ్లు నాటకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.