ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై పోరు: దేశవ్యాప్తంగా 'ప్లాగ్​ రన్​'

author img

By

Published : Oct 2, 2019, 10:59 AM IST

Updated : Oct 2, 2019, 8:49 PM IST

ప్లాస్టిక్​ భూతాన్ని తరిమికొట్టే దిశగా భారత్​ తొలి అడుగు వేసింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ఉదయాన్నే ప్రధాన నగరాల్లో ప్లాగ్​ రన్​ సందడిగా సాగింది. ఔత్సాహికులు జాగింగ్​ చేస్తూ, రోడ్లపై ఉన్న ప్లాస్టిక్​ వ్యర్థాలను ఏరేశారు.

ప్లాస్టిక్​పై పోరు: దేశవ్యాప్తంగా 'ప్లాగ్​ రన్​'

ప్లాస్టిక్​పై పోరు: దేశవ్యాప్తంగా 'ప్లాగ్​ రన్​'

'ఫిట్​ ఇండియా ప్లాగ్​ రన్​' దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రధాన నగరాల్లో ప్రజలు ఉదయాన్నే జాగింగ్ చేస్తూ, రోడ్డుపై కనిపించిన ప్లాస్టిక్​ను ఏరేశారు.

దిల్లీలో ప్లాగ్​ రన్​ను కేంద్ర క్రీడల శాఖమంత్రి కిరణ్​ రిజుజు జెండా ఊపి ప్రారంభించారు. రెజ్లర్ భజ్​రంగ్​ పునియా సహా మరికొందరు క్రీడా ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"నేనొక ఎయిర్ పిస్టల్ షూటర్​ను. ఫిట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఇక్కడికి వచ్చాను. మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా నిర్దేశించుకున్న ఈ ఫిట్ ఇడియా- క్లీన్ ఇండియా లక్ష్యం బాగుంది. ఈ కారణంగానే ఇందులో భాగం కావాలని వచ్చాను."

-అభిషేక్ వర్మ, షూటర్

పరుగు తీస్తూ ప్లాస్టిక్ చెత్తను ఏరేసే కార్యక్రమమే ప్లాగింగ్. అక్టోబరు 2న ప్రతి ఒక్కరూ 2 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ.. దారిలో కనిపించే చెత్తను తొలగించాలని దేశ ప్రజలకు ఇటీవల పిలుపునిచ్చారు ప్రధానమంత్రి మోదీ.

ఇదీ చూడండి: గాంధీ 150: ప్లాస్టిక్​ వ్యర్థాలతో అతి పెద్ద రాట్నం

Patna (Bihar), Oct 30 (ANI): Fire broke out at a petrol pump on Nala Road of Dinkar Golambar area in Patna. Fire tenders are present at the spot. Further details are awaited.
Last Updated : Oct 2, 2019, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.