ETV Bharat / bharat

వలస కూలీల కష్టాలపై సుప్రీం సుమోటో విచారణ

author img

By

Published : May 26, 2020, 6:30 PM IST

కరోనా లాక్​డౌన్​తో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ నెల 28న సుమోటో విచారణ చేపట్టనున్నట్టు స్పష్టంచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.

SC on its own takes cognizance of miseries of migrant labourers
'వలస' కష్టాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం

లాక్​డౌన్​ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల సమస్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. ఈ అంశంపై ఈ నెల 28న విచారణ జరపనుంది.

జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ ఎమ్​ ఆర్​ షాతో కూడిన ధర్మాసనం.. వలస కూలీల కష్టాలపై కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన చర్యలను గురువారంలోపు తెలపాలని స్పష్టం చేసింది.

కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో మార్చి నెల నుంచి ఇప్పటివరకు వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు తిరిగివెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. సరైన వసతులు లేక చాలా మంది కాలినడకనే ఊళ్లకు వెళుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.