ETV Bharat / bharat

చైనా కుట్రలను దీటుగా తిప్పికొడతాం: రాజ్​నాథ్

author img

By

Published : Sep 15, 2020, 3:10 PM IST

Updated : Sep 15, 2020, 3:58 PM IST

Rajnath Singh makes a statement on India-China border issue
చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు: రాజ్​నాథ్​

15:42 September 15

చైనాతో సరిహద్దు వివాదంపై లోక్​సభలో ప్రకటన చేశారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్. సరిహద్దుల నిర్ణయానికి డ్రాగన్ దేశం ఒప్పుకోవడం లేదని చెప్పారు. ఇప్పటివరకు చైనా మొత్తం 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని వెల్లడించారు. చైనా కుట్రలను భారత్​ సమర్థవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు.

" 1993, 1996 ఒప్పందాలను చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడింది. ఆగస్టులో భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. డ్రాగన్ దేశం దుశ్చర్యలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. సరిహద్దులో బలగాలను మరింత పెంచాం."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతుందన్నారు రాజ్​నాథ్​. ఆ దేశంలో భారత్​ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుందని చెప్పారు. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని.. ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ వాకౌట్​..

రాజ్​నాథ్​ ప్రకటన అనంతరం చైనాతో సరిహద్దు వివాదం అంశంపై చర్చకు డిమాండ్​ చేస్తూ సభ నుంచి వాకౌట్​ చేశారు కాంగ్రెస్ ఎంపీలు.

15:24 September 15

  • ఎల్‌ఏసీని రెండు దేశాలు గౌరవించాలి: రాజ్‌నాథ్‌సింగ్‌
  • చైనా కదలికలను నిరంతరం గమనిస్తున్నాం: రాజ్‌నాథ్‌సింగ్‌
  • ఆగస్టులో భారత్‌ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నించింది: రాజ్‌నాథ్‌సింగ్‌
  • సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు చైనా పాల్పడింది: రాజ్‌నాథ్‌సింగ్‌
  • మన సైన్యం చైనా దుశ్చర్యలను సమర్థంగా తిప్పికొట్టింది: రాజ్‌నాథ్‌సింగ్‌
  • 1993, 96 ఒప్పందాలను చైనా ఉల్లంఘించింది: రాజ్‌నాథ్‌సింగ్‌
  • సరిహద్దుల్లో బలగాలను మరింత పెంచాం: రాజ్‌నాథ్‌సింగ్‌
  • సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం: రాజ్‌నాథ్‌సింగ్‌
  • ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్‌సింగ్‌
  • భారత్‌తో కలిసి నడవాలని చైనాను కోరుతున్నాం: రాజ్‌నాథ్‌సింగ్‌

15:17 September 15

  • చైనాతో మేం స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నాం: రాజ్‌నాథ్‌సింగ్‌
  • సామరస్య చర్చలతోనే సరిహద్దు సమస్యలకు పరిష్కారం: రాజ్‌నాథ్‌సింగ్‌
  • చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై తీవ్ర ప్రభావం: రాజ్‌నాథ్
  • సరిహద్దు సమస్య తేలేవరకు ఎల్‌ఏసీని గౌరవించాలన్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తోంది: రాజ్‌నాథ్
  • మే నుంచి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు, సైన్యాన్ని మోహరిస్తోంది: రాజ్‌నాథ్
  • భారత్‌ కూడా తగిన రీతిలో సైన్యాన్ని మోహరిస్తోంది: రాజ్‌నాథ్‌
  • చైనా ఏకపక్ష చర్యలను భారత్‌ ఖండిస్తోంది: రాజ్‌నాథ్‌సింగ్‌

15:12 September 15

  • మొత్తం 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది: రాజ్‌నాథ్‌
  • ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి సైనికులను కలిశారు: రాజ్‌నాథ్‌
  • సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదు: రాజ్‌నాథ్‌సింగ్‌
  • ఎల్‌ఏసీ విషయంలో రెండుదేశాల మధ్య వివాదాలు ఉన్నాయి: రాజ్‌నాథ్‌సింగ్‌
  • ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు ఎంతో ప్రయత్నించాం: రాజ్‌నాథ్‌సింగ్‌

15:08 September 15

చైనా కుట్రలను దీటుగా తిప్పికొడతాం: రాజ్​నాథ్

  • భారత్‌-చైనా సరిహద్దు సమస్యపై లోక్‌సభలో రక్షణమంత్రి ప్రకటన
  • లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించింది: రాజ్‌నాథ్‌సింగ్‌
  • చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు: రాజ్‌నాథ్‌సింగ్‌
Last Updated : Sep 15, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.