ETV Bharat / bharat

హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు అసెంబ్లీ స్పీకర్​

author img

By

Published : Jul 22, 2020, 10:53 AM IST

Updated : Jul 22, 2020, 12:11 PM IST

రాజస్థాన్​ రాజకీయాలు మరింత వేడెక్కాయి. సచిన్​ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు ఆదేశించటంపై.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్​ సీపీ జోషి. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Rajasthan Speaker to file petition in Supreme Court
హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు అసెంబ్లీ స్పీకర్​

రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తిరుగుబాటు నేత సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర స్పీకర్​ సీపీ జోషి. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో స్పెషల్​ లీవ్​ పిటిషన్​(ఎస్​ఎల్​పీ) దాఖలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

"షోకాజ్​ నోటీసులు పంపే పూర్తి అధికారం స్పీకర్​కు ఉంది. సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేయమని మా న్యాయవాదిని కోరాను. స్పీకర్​ బాధ్యతలు సుప్రీం కోర్టు, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించాయి. స్పీకర్​గా నాకు ఓ దరఖాస్తు వచ్చింది. దానిపై సమాచారం తెలుసుకోవాలనుకునే షోకాజ్​ నోటీసులు జారీ చేశాను. ఉన్న అధికారంతో నోటీసులు ఇవ్వకపోతే.. ఇకా ఆ అధికారం ఎందుకు?"

- సీపీ జోషి, రాజస్థాన్​ అసెంబ్లీ స్పీకర్​

నోటీసులు ఇవ్వటం అనేది స్పీకర్​ బాధ్యత అని.. తీర్పుపై ఆధారపడాల్సింన అవసరం లేదన్నారు జోషి. ఇది కేవలం షోకాజ్​ నోటీసేనని.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం అనుసరించి స్పీకర్ తీసుకున్న​ నిర్ణయాన్ని మారుస్తూ 1992 నుంచి ఏ కోర్టు తీర్పు వెలువరించలేదని గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పదవుల అధికారాలు స్పష్టంగా నిర్వచించారని.. ఎన్నికైన వారు ఆ పదవిని చేపడతారని పేర్కొన్నారు.

విప్‌ ధిక్కరించి శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరైన పైలట్ సహా 19మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు స్పీకర్​ జోషి.

హైకోర్టు ఆదేశాలు..

స్పీకర్​ నోటీసులను సవాల్​ చేస్తూ సచిన్​ పైలట్​ వర్గం దాఖలు చేసిన పిటిషన్​పై మంగళవారం(జులై 21న) విచారణ జరిపి.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. అనర్హత వేటుపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ఇదీ చూడండి: సచిన్ పైలట్ వర్గానికి హైకోర్టులో ఊరట

Last Updated : Jul 22, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.